మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చల్వాయ్ లో ఫిలడెల్ఫియా తెలంగాణ డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్, ఆద్వర్యంలో శుక్రవారం అసోసియేషన్ నిర్వాహకులు శ్రీ రవిప్రకాష్ మేరెడ్డి మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ డైరీ ఆటిట్యూడ్ చేంజర్ పాఠశాలలో ప్రారంభించడం జరిగింది. ఏపీజే అబ్దుల్ కలామ్ డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీధర్ ఆద్వర్యంలో ఎంతో ఉత్సాహంతో 200 డైరీలను డొనేట్ చేయడం జరిగింది. ఈ డొనేషన్ కార్యక్రమానికి వారు ప్రత్యేక చొరవ చుపించారు. మరియు రవిప్రకాశ్ ఆద్వర్యంలోనే అమెరికానుండి చల్వాయి పాఠశాల పిల్లలకు వారానికి ఒకసారి రమేష్ మరియు వారి కూతురు తరిణి ఒక గంట పాటు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే, పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయులు శ్రీ బి. శ్యామ్ సుందర్ రెడ్డి నేతృత్వంలో, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు ప్రత్యేక డైరీ నిర్వహణపై కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాల బయాలజి ఉపాధ్యాయులు శ్రీ బాబు డైరీ రైటింగ్ డ్రైవ్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్న ఆశయాన్ని వ్యక్తం చేశారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కాటం మల్లారెడ్డి ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, విద్యార్థులలో భవిష్యత్తు లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి డైరీ రాయడం ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు ఇప్పటినుండే ఇంగ్లీషు రాయడం చదవడం మాట్లాడడం నేర్చుకోవాలని దానివలన భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు చంద్రారెడ్ది, ఏ రమాదేవి, ఎస్. శ్రీనివాస్, యం వి. రమణమూర్తి, సి హెఛ్. శంకరయ్య, ఎం. సుదాకర్, జి. సారయ్య, వి. అన్నపూర్ణ, పి. శ్రీదేవి. డి. స్వాతి, కె. అవంతిక పాల్గొన్నారు.