రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన వడ్లం విద్యార్థులు

Vadlam students selected for state level competitionsనవతెలంగాణ – పెద్దకొడప్ గల్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియం లో శుక్రవారం నిర్వహించిన సౌత్ జోన్ అథ్లెటిక్ అసోసియేషన్ క్రీడా పోటీలలో పెద్ద కొడప్తల్ మండల విద్యార్థులు ప్రతిభకనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయి నట్లు వడ్లం పాఠశాల పిఈటి ధర్మేందర్ తెలిపారు. ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన పోటీలలో వడ్లం పాఠశాలకు చెందిన భట్ కీర్తన హైజంప్లో ప్రథమ స్థానం, మనూష షాట్పుట్లో రెండవ స్థానం, జాలాబాయి జావెలిన్స్లోలో రెం డవస్థానం, రాంసింగ్ 1500 మీటర్ల రన్నింగ్లో రెండవ స్థానం సాధించారని తెలిపారు. దీంతో పాటుగానే మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విశాఖ లాంగ్లింప్ ప్రథమ స్థానం, అంజలి జావెలిన్ త్రోలో మొదటి స్థానం, శ్రీలత 600 మీటర్ల పరుగుపందెంలో మూడవ స్థానం, పెద్ద కొడపల్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు సిందూ 60 మీటర్ల పరుగు పందెంలో 3′ స్థానం, ముస్తాపా 8 వందల మీటర్ల పరుగుపందెంలో రెండవ స్థానం సాధించారని తెలిపారు. ఇందులో నుండి కీర _న, విశాఖ ఈ నెల 19, 20 తేదిలలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలలో పిఈటీలు మల్లేష్ లత. జ్యోతిలు పాల్గొన్నారు.