విద్యార్థులు మూఢనమ్మకాలను వదిలేయాలి

Adilabadనవతెలంగాణ-ఆసిఫాబాద్‌
విద్యార్థులు మూఢనమ్మకాలను వదిలేయాలని విజ్ఞాన దర్శనం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్‌ అన్నారు. విజ్ఞాన దర్శనం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాల ఆదర్శ పాఠశాల విద్యార్థులకు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మంత్రాల పేరుతో తంత్రాల పేరుతో ప్రజలు విద్యార్థులు తమ ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారని, వాటిని నమ్మకూడదని తెలిపారు. విద్యార్థులు విజ్ఞానం పైన ఎక్కువ దృష్టి పెట్టాలని మూఢనమ్మకాలను తరిమికొట్టే విధంగా ఉండాలన్నారు. అనంతరం వివిధ రకాలుగా మ్యాజిక్కులు చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గేడం టికనంద్‌, గొడిసెల కార్తీక్‌, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్‌, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షురాలు కొరంగ మాలాశ్రీ, డీవైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శిలు ఆత్మకూరు సతీష్‌, వడ్లూరి శ్రీకాంత్‌, కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మస్క నగేష్‌, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణరు, విజ్ఞానదర్శిని రాష్ట్ర నాయకులు ఆదం రాజు, మొహమ్మద్‌ అలీ, మహేష్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా నాయకులు చిట్టి భారతి, అక్షయ, రమేష్‌ పాల్గొన్నారు.