సీపీఐ(ఎం) పొన్కల్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రాజన్న

Rajanna as president of CPI(M) Ponkal village committeeనవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని పొనకల్ సీపీఐ(ఎం) గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గుడ్ల రాజన్నను నియమించినట్లు ఆ పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె  రవి, జన్నారం మండల కార్యదర్శి కనికారం  అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం  మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రాజన్నను గ్రామ కమిటీ కార్యదర్శిగా ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీని గ్రామంలో పటిష్ఠం చేసి, పేద ప్రజలకు అండగా నిలుస్తామన్నారు.