కామారెడ్డి జిల్లా కేంద్రంలో హాసన్ ఫంక్షన్ హాల్ లోజిల్లా అధ్యక్షులు రాజనర్సు అధ్యక్ష తన కామారెడ్డి మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను పర్మిట్ చేయాలనీ, ప్రజా పాలన పేరు తోటి ప్రజా ఆదరణ పొంది అధికారం లోకి వచ్చిన ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల కు రక్షణ కల్పిసమని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వనీ ఏర్పాటు చేస్తే మున్సిపల్ కార్మికులను పర్మిట్ చేస్తానని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందన్నారు. మున్సిపల్ కార్మికుల్లో అత్యధికంగా దళితులు, బడుగు, బలహీన వర్గాలు ప్రైస్ ప్రజలే మున్సిపల్ లో పనిచేస్తున్నారన్నారు. వీరి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగానే ఆలోచించి మెనూ పేస్ట్ లో పెట్టడం జరిగిందనీ, ఇప్పటికైనా మున్సిపల్ కార్మికులు పేమెంట్ చేయాలని, వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, కార్మికులు చనిపోతే మట్టి ఖర్చులు రూ.30000 ఇవ్వాలని, 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు 10 లక్షల రూపాయలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, వారి కుట్టుబంలో ఒక్కరికి ఉద్యోగం కల్పిచాలని, మున్సిపల్ కార్మికులకు స్థానిక సమస్యలు పరిష్కరించాలన్నారు. బట్టలు, సభ్యులు, రైన్ కోట్లు ఇవ్వాలనీ, మున్సిపల్ కార్మికులకు న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని జనరల్ బాడీ సమావేశం నిర్ణయించిందన్నారు. మున్సిపల్ ఆఫీస్ ముందు సమస్యల పైన పోరాటం చేయటం జరుగుతుందని, అక్టోబర్ 8వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తామని, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయని యెడల చలో సిడిఎంఏ కార్యాలయం ముందు దర్న ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు నాయ్యం చేస్తుందని ఆశిస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్, నాయకులు మహబూబ్, అధ్యక్షులు ప్రభాకర్, నాయకులు దీపక్, శివ, రాజవ్వ, జ్యోతి, కందారం రాజమణి, కిషన్, విజయ్ 200 మంది మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.