గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌లో సింక్రోనీకి ఐదో స్థానం

హైదరాబాద్‌ : పని చేసేందుకు అత్యుత్తమ కంపెనీలో ఒక్కటిగా తమ సంస్థ నిలిచిందని ప్రీమియర్‌ కన్య్సూమర్‌ ఫైనాన్సీయల్‌ సర్వీసెస్‌ కంపెనీ సింక్రోనీ వెల్లడించింది. గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌ ఇండియా జాబితాలో తమ సంస్థ ఐదో స్థానం దక్కించుకుందని పేర్కొంది. తమ ఉద్యోగులకు సమ్మిళిత, మద్దతుతో కూడిన, స్పూర్తిదాయక వాతావరణం అభివృద్థి చేయడంలో సింక్రోనీ రాజీలేని నిబద్ధతకు ఇది ప్రతీకగా నిలుస్తుందని తెలిపింది. తమ సంస్థలో 50 శాతం మహిళా ప్రాతినిధ్యం కలిగి ఉండటంతో పాటుగా 100 మంది వికలాంగులు ఉన్నారని సింక్రోని ఇండియా బిజినెస్‌ లీడర్‌ ఆండీ పొన్నేరీ పేర్కొన్నారు.