1. తెలంగాణకు సంబంధించినంత వరకు చారిత్రక యుగం ఎప్పటి నుండి ప్రారంభమైందని చెప్పవచ్చు?
1. క్రీ.పూ.6వ శతాబ్దం 2. క్రీ.పూ.7వ శతాబ్దం
3. క్రీ.పూ. 8వ శతాబ్దం 4. క్రీ.పూ.9వ శతాబ్దం
2. కింది వాటిలో దక్షిణాపథాన్ని మొదటిసారిగా నిర్ధిష్ట భూభాగార్థంలో విస్తృతంగా ఉపయోగించనవి ఏవి?
1. బోధాయన ధర్మ సూత్రాలు 2. బౌద్ధమత సుత్తనిపాతం
3. వినయ పీఠకం 4. పైవన్నీ
3. క్రీ.శ.1వ శతాబ్దంలో తన రచనల్లో దక్కన్ గురించి స్పష్టంగా పేర్కొన్న విదేశీయుడు ఎవరు?
1. ప్లీనీ 2. మార్కోపోలో
3. న్యూనిజ్ 4. నికోలోకాంటి
4. 1వ శతాబ్దపు తెలుగుదేశాన్ని ‘టెలింగాన్’ అని పేర్కొన్న విదేశీ రచయిత ఎవరు?
1. అరిస్టాటిల్ 2. కొపర్నికస్
3. టాలమీ 4. కెప్లర్
5. కింది వాటిలో ఏది క్రీ.శ.6వ శతాబ్దంలో భారతదేశంలోని షోడశ(16) జనపదాలలో ఒకటిగా ఉండేది?
1. అవంతి 2. గాంధార
3. పాంచాల 4. పైవన్నీ
6. భారతదేశంలో 6వ శతాబ్దంలో షోడశ పజనపదాలుండేవని పేర్కొన్న గ్రంథం ఏది?
1. మహాభారతం 2. రామాయణం
3. అంగుత్తర నికాయ 4. అభిదమ్మ పీఠిక
7. సుత్తనిపాత వ్యాఖ్యానంలో గోదావరి నదికి ఉభయ పార్శ్వములలో అంధక రాష్ట్రములని చెప్పబడినవి క్రింటివాటిలో ఏవి?
1. అశ్మక, అవంతి 2. అశ్మక, గాంధార
3. అశ్మక, కాంభోజ 4. అశ్మక, ములక
8. వాయు పురాణంలో పేర్కొనబడిన అశ్మక రాజధాని పోదన్‌ను ప్రస్తుత తెలంగాణలోని ఏ పట్టణంగా చరిత్రకారులు భావిస్తున్నారు?
1. నిర్మల్ 2. బోధన్
3. పెద్దపల్లి 4. నల్లగొండ
9. బోధన్‌ను రాజధానిగా చేసుకొని పరిపాలించాడని జైన గ్రంథాలు తెలుపుతున్న ఋషభనాథుని కుమారుడు ఎవరు?
1. వర్థమాన మహావీరుడు 2. విక్రమేంద్రుడు
3. శీతలనాథుడు 4. బాహుబలి
10. కోసలరాజు. కుల గురువైన భావరి అనే బ్రాహ్మణాచార్యుడు అస్సక జనపదంలో స్థిరపడి ఆశ్రమం నిర్మించుకొని విద్యాబోధన చేసేవాడని ఏ గ్రంథంలో పేర్కొనబడి ఉంది?
1. అంగుత్తరనికాయ 2. సుత్తనిపాత
3. వినయపీఠిక 4. అభిదమ్మ పీఠిక
11. 19వ శతాబ్దంలో రాబర్ట్ బ్రూస్‌పుట్ బృహత్ శిలాయుగపు సమాధులు కనుగొన్న వలిగొండ ఏ జిల్లాలో ఉంది?
1. ఖమ్మం 2. నల్గొండ
3. సూర్యాపేట 4. యాదాద్రి
12. వాయు బ్రాహ్మండాది పురాణాల్లో ఆంధ్రులకు పొరుగువారిగా ప్రస్తావించబడిన పారదులను దక్షిణాత్యులని ఎవరి శాసనాలు తర్వాత కాలంలో పేర్కొన్నాయి?
1. అశోకుడు 2. కనిష్కుడు
3. జయసింహ వల్లభుడు 4. అజాతశత్రువు
13. కిందివారిలో ఆంధ్రులు ఆర్య దండయాత్రల వల్ల మధ్య ఆసియా నుండి దక్షిణాపథానికి వచ్చేటప్పటికి ప్రస్తుత ఆంధ్రదేశంలో విస్తరించి ఉన్న జాతి?
1. నాగులు 2. మహిషకులు
3. అశ్మకులు 4. పైవారందరూ
14. కింది ఏ ప్రాంతాల్లో మహిషకులు ఉండినట్లు పురావస్తు ఆధారాల వల్ల తెలుస్తుంది?
1. మెదక్ జిల్లా 2. నల్లగొండ జిల్లా
3. ధార్వాడ్ జిల్లా (కర్ణాటక) 4. పైవన్నీ
15. కిందివాటిలో కళింగ పదానికి సరైన అర్థం ఏది?
1. జలమయం 2. వరిధాన్యం తినేవారు
3. తీర ప్రాంతంలో నివసించేవారు 4. పైవన్నీ
16. క్రీ.శ. 12వ శతాబ్దమునకు చెందిన ఏ శాసనంలో ‘తెలుంగ’ అనే పదం ఉన్నది?
1. కుర్గోడు 2. మస్కీ
3. రాజులమందగిరి 4. పైవన్నీ
17. గాంగ వంశస్థుడైన ఇంద్రవర్మ వేయించిన పుర్లి శాసనంలో లభ్యమైన పదం ఏది?
1. టిలింగాన్ 2. తెలుంగ
3. తెనుగు 4. తిలింగ
18. టాలమీ తన గ్రంథమైన ‘జాగ్రఫీ’లో మధ్య కళింగను ఏమని వ్యవహరించి ఉంటాడని చరిత్రకారులు భావించారు?
1. తెన్ కళింగ్ 2. మెడోకళింగ్
3. లోకళింగ్ 4. పైవన్నీ
19. కింది ఏ వ్యాకరణ గ్రంథంలో ‘తెలుంగం’ అని భాషాపరంగా తెలుగు కనిపిస్తుంది?
1. అష్టాధ్యాయి 2. తోల్‌కప్పియం
3. శిలప్పాధికారం 4. అగత్తియం
20. కిందివాటిలో తెలుగు తామ్ర శాసనాలలో మొట్టమొదటిగా చరిత్రకారులు భావించిన శాసనం ఏది?
1. విలస శాసనం 2. తిరుమల శాసనం
3. అనుమకొండ శాసనం 4. మద్రాస్ మ్యూజియం తామ్ర శాసనం
21. ఆంధ్రదేశంలో మొట్టమొదటి తెలుగు శాసనంగా పరిగణించ బడుతున్న కళ్లమళ్ల శాసనం వేయించినవారు ఎవరు?
1. ధనుంజయుడు 2. జయసింహ వల్లభుడు
3. కుబ్జ విష్ణువర్ధనుడు 4. బల్లియచోళుడు
22. కింది ఏ శాసనంలో సగం తెలుగు, సగం సంస్కృత పదాలున్నాయి?
1. కళ్లమళ్ల శాసనం 2. విప్పర్ల శాసనం
3. ఎర్రరుడిపాడు శాసనం 4. చేజర్ల శాసనం
23. కిందివాటిలో శ్రీకృష్ణదేవరాయలు వేయించిన ఏ శాసనంలో ‘తెలుంగాణ’ శబ్దం కనిపిస్తుంది?
1. చిన్నకంచి శాసనం (తమిళనాడు)
2. తిరుమల శాసనం (చిత్తూరు జిల్లా)
3. పైరెండూ 4. పైవేవీకావు
24. కిందివాటిలో ఇటీవల సంగారెడ్డి జిల్లాలోని ఏ ప్రాంతంలో బయల్పడిన క్రీ.శ. 1417 నాటి శాసనంలో ‘తెలుంగణ’ పదం పేర్కొనబడింది?
1. లింగంపల్లి 2. తుఫ్రాన్
3. వర్గల్ 4. తెల్లాపూర్
25. గోదావరికి ఇరువైపులా అళక (ఆశ్మక) ములక (నాందేడ్, ఔరంగాబాద్ జిల్లాలు) రాజ్యాలున్నాయని అవి అందకరార్ధలుగా పేర్కొన్నది?
1. భావరి వృత్తాంతం 2. అంగుత్తరనికాయ
2. ఇండికా 4. మాళవికాగ్నిమిత్ర
26. మౌర్యుల్లో చివరివాడైన బృహద్రుడిని అతని సేనాని పుష్యమిత్రశుంగుడు హత్యచేసి క్రీ.పూ.187లో అధికారంలోకి వచ్చాడని ఈ కుట్రను వ్యతిరేకించి ఆంధ్రులు తిరుగుబాటు చేయగా వారిని శంగులు ఓడించారని తెల్పుతున్న నాటకం ఏది?
1. ధర్మామృతం 2. సుత్తనిపాదం
3. మాళవికాగ్నిమిత్రం 4. క్రీడాభిరామం
27. అశోకుడు ఎన్నవ శాసనంలో తన రాజ్యానికి దక్షిణంగా కళింగ, ఆంధ్ర, భోజక, రఠిక రాజ్యాలున్నట్లు వారు ధర్మాన్ని పాటిస్తున్నట్లు పేర్కొన్నాడు?
1. 4వ శిలాశాసనం 2. 8వ శిలాశాసనం
3. 13వ శిలాశాసనం 4. 10వ శిలాశాసనం
28. శాతవాహనులకు పూర్వం క్రీ.పూ. 1, 2 శతాబ్దాల్లో స్థానిక రాజులు చిన్న చిన్న రాజ్యాలను పాలించారు కాగా వడ్డెమాను శాసనంలో పేర్కొన్న రాజులు ఎవరు?
1. కుభీరకుడు 2. సోమకుడు
3. సరిసద 4. నారన
29. ఈ కింది వానిలో సరికాని జతను గుర్తించండి?
1. వడ్డెమాను శాసనం-రాజు సోమకుడు, జంటుపల్లిల ప్రస్తావన
2. వేల్పూరు శాసనం – సరిసద, అశోక సదల ప్రస్తావన
3. కోటిలింగాల- గోపద, సమగోప, కంవాయసిరిల నాణేల లభ్యం
4. వీరాపురం-నిగమసభ, గోష్టిల ప్రస్తావన
30. శివమహస్తిన్, శివస్కందహస్తిన్ అనే శాతవాహన పూర్వరాజుల నాణేలు లభించిన ప్రాంతం ఏది?
1. వడ్డెమాను కొండ 2. వెల్పూరు
3. కోటిలింగాల 4. వీరాపురం
31. తెలంగాణలో తామ్ర శాసనాలు వేయించిన రాజవంశం ఏది?
1. శాతవాహనులు 2. ఇక్ష్వాకులు
3. విష్ణుకుండినులు 4. కాకతీయులు
32. కిందివాటిలో కాకతీయుల పుట్టుపూర్వోత్తరాలను గూర్చి వివరించే మొదటి శాసనం ఏది?
1. మాగల్లు శాసనం 2. చందుపట్ల శాసనం
3. ఖండవల్లి శాసనం 4.హనుమకొండ శాసనం
33. కిందివాటిలో ప్రోలయ శాసనం ఏది? నాయకుని ఘనకార్యాలను తెలిపే శాసనం ఏది?
1. ద్రాక్షారామ శాసనం 2. కలువచేరు శాసనం
3. కురవగట్టు శాసనం 4. విలాస తామ్ర శాసనం
34. కింది ఎవరి కాలంలో తెలుగు రాజభాషగా, శాసన భాషగా అధికార ప్రతిపత్తి పొందింది?
1. రాష్ట్రకూటులు 2. రేనాటి చోళులు
3. కాకతీయులు 4. ఇక్ష్వాకులు
35. కిందివాటిలో విష్ణుకుండినులకు సంబంధించిన శాసనం ఏది?
1. గోరంట్ల తామ్ర శాసనం 2. పాలమూరు శాసనం
3. తుమ్మలగూడెం శాసనం 4. పైవన్నీ
36. కింది వాటిలో శాతవాహనుల కాలంనాటి నాణేలు లభ్యమైన ప్రదేశం?
1. కోటిలింగాల 2. కొండాపురం
3. పెద్దబంకూరు 4. పైవన్నీ
37. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన ఏ రాజవంశ ప్రాకృత శాసనం హైదరాబాద్‌లోని చైతన్యపురిలో మూసీనది తీరంలో లభించింది?
1. శాతవాహనులు 2. ఇక్ష్వాకులు
3. విష్ణుకుండినులు 4. కాకతీయులు
38. తెలంగాణలో తొలి తెలుగు గద్య శాసనంగా ప్రసిద్ధి చెందిన కొరవి శాసనం కింది ఏ రాజవంశానికి చెందినది?
1. బాదామి చాళుక్యులు 2. కళ్యాణి చాళుక్యులు
3. వేములవాడ చాళుక్యులు 4. రాష్ట్రకూటులు
39. కిందివాటిలో తెలంగాణలో లభించిన ఏ సంస్కృత శాసనంలో తెలుగు పదాలున్నట్లు గుర్తించారు?
1. గద్వాల శాసనం 2. పాలంపేట శాసనం
3. పానగల్లు శాసనం 4. కలువచేరు శాసనం
40. ప్రాచీన స్థానిక చరిత్రలగు కైఫీయత్తులను ప్రప్రథమంగా సేకరించిన వారు ఎవరు?
1. కల్నన్ మెకంజీ 2. లార్డ్ రిప్పన్
3. లార్డ్ మేయో 4. సి.పి.బ్రౌన్
41. కిందివాటిలో కాకతీయ యుగాన్ని గూర్చి తెలుసు కోవడానికి ఉపయోగపడు వాన్మయం?
1. క్రీడాభిరామం 2. ప్రతాపరుద్ర యశోభూషణం
3. నిర్వచనోత్తర రామాయణం 4. పైవన్నీ
42. కిందివాటిలో గణపతిదేవుడు సముద్ర వ్యాపారానికి రక్షణ కల్పిస్తూ వేసిన అభయ శాసనం ఏది?
1. బయ్యారం శాసనం 2. పిల్లలమర్రి శాసనం
3. చందుపట్ల శాసనం 4. మోటుపల్లి శాసనం
43. కిందివాటిలో వేములవాడ చాళుక్యుల శాసనం ఏది?
1. పర్భని శాసనం 2. కుర్క్యాల శాసనం
3. చెన్నూరి శాసనం 4. పైవన్నీ
44. కిందివాటిలో రేచర్ల పద్మనాయకుల శాసనం ఏది?
1. వాడపల్లి శాసనం 2. సోమవరం శాసనం
3. పిల్లలమర్రి శాసనం 4. పైవన్నీ
45. కిందివాటిలో అల్లా ఉద్దీన్ ఖిల్జీ కాకతీయ రాజ్యంపై చేసిన దండయాత్రలను గూర్చి వివరించే గ్రంథం ఏది?
1. తారిఖ్-ఇ-ఖిల్జీ 2. తారిఖ్-ఇ-అహ్మద్
3. తారిఖ్-ఇ-ఆలమ్ 4. తారిఖ్-ఇ-బాబరీ
46. కిందివాటిలో తెలంగాణలో లభించిన శాసనాల్లో అచ్చ తెలుగు భాష కనిపించు శాసనం ఏది?
1. ఆగామోత్కూరు శాసనం 2. ఫణిగిరి శాసనం
3. పాలంపేట శాసనం 4. విలాస శాసనం
47. తెలంగాణలో లభించిన మొగల్ చెరువు శాసనం కింది ఏ వంశ పాలన గూర్చి తెలుపుతుంది?
1. వేములవాడ చాళుక్యులు 2. కళ్యాణి చాళుక్యులు
3. బాదామి చాళుక్యులు 4. ముదిగొండ చాళుక్యులు
48. కిందివాటిలో శాతవాహనుల సంస్కృతిని తెలుసుకోవడానికి ఉపయోగపడు వాన్మయం ఏది?
1. బృహత్కథ 2. గాథాసప్తశతి
3. వాత్సాయన కామసూత్రాలు 4. పైవన్నీ
49. కాకతీయుల సామంతులుగా శాసనాలు ఎవరిని పేర్కొంటున్నాయి?
1. గోన వంశం 2. నతవాడి వంశం
3. రేచర్ల పద్మనాయకులు 4. పైవారందరూ
50. తెలుగులో రాయించిన మొట్టమొదటి తామ్ర శాసనం అయిన మద్రాసు మ్యూజియం తామ్ర పట్టిక ఎవరికి చెందినదిగా భావిస్తున్నారు?
1. బల్లయ చోడుడు 2. ఉదయన చోళుడు
3. కరికాల చోళుడు 4. కుళోత్తుంగ చోళుడు
సమాధానాలు
1.1 2.4 3.1 4.3 5.4 6.3 7.4 8.2 9.4 10.2 11.4 12.1 13.4 14.4 15.4 16.1 17.4 18.2 19.4 20.4 21.1 22.4 23.3 24.4 25.1 26.3 27.3 28.2 29.4 30.4 31.3 32.1 33.4 34.2 35.4 36.4 37.3 38.4 39.1 40.1 41.4 42.4 43.4 44.4 45.3 46.1 47.4 48.4 49.4 50.1