
భిక్కనూరు పట్టణ కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నేడు సోమవారం చతుర్దశి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. వేడుకలను పురస్కరించుకొని ఆలయానికి రంగులు వేయించారు. ఉదయం నుంచి జిల్లా నలుమూలల నుంచి మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి కోటి వత్తులు వెలిగించునున్నారు. వత్తులు వెలిగించడానికి వచ్చిన భక్తుల కోసం ఆలయ నిర్వహాకులు అన్నదానం నిర్వహించనున్నారు.