గుర్తింవు లేని వ్యక్తులను బ్యాంకులోకి అనుమతివ్వొద్దు

Adilabad– మంచిర్యాల సీఐ ఆర్‌ బన్సిలాల్‌
నవతెలంగాణ-మంచిర్యాల
బ్యాంకులు, ఇతర ప్రయివేట్‌ ఫైనాన్స్‌ సంస్థలు నిర్వాహకులు గుర్తింపు లేని వ్యక్తులను వారి ఆఫీస్‌ లోనికి అనుమతించకూడదని మంచిర్యాల పట్టణ సీఐ ఆర్‌ బన్సిలాల్‌ సూచించారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిందుతుడిని అదుపులోకి తీసుకొని వివరాలు తెలియజేశారు. ఈ నెల 3వ తేదిన బ్యాంక్‌లోకి అనుమానస్పధంగా ఉన్న వ్యక్తి వచ్చి క్యాష్‌ కౌంటింగ్‌ మిషన్‌లు రిపేర్‌ చేస్తామని తెలిపి బ్యాంక్‌ సిబ్బంది అనుమతితో మిషన్‌ రిపేర్‌ చేసినట్లు నటించి రూ. 50 వేలు తీసుకొస్తే చెక్‌ చేస్తా అని చెప్పాడు. అతని మాటలు నమ్మిన బ్యాంక్‌ సిబ్బంది రూ.50 వేలు తెచ్చి ఇచ్చి వారి పనిలో నిమగమయ్యారు. గమనించిన నిందితుడు రూ.50 వేలు తీసుకొని బ్యాంక్‌ సిబ్బంది కళ్ళు గప్పి అక్కడి నుండి పారి పోయాడు. గమనించిన బ్యాంక్‌ సిబ్బంది మోసపోయామని గ్రహించి మంచిర్యల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాగ విచారణలో భాగంగా నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగ అతని పేరు రోహిత్‌ బాబు లాల్‌ ప్రకాష్‌(30) సికింధ్రాబాద్‌లో నివాసం ఉంటూ టెక్నీకల్‌ పని నేర్చుకొని పలు చోట్ల తన కుటుంబ సభ్యులుతో కలిసి ప్రింటింగ్‌ మిషన్‌లు రిపేర్‌ చేసే వాడని, కొద్ది రోజుల తరువాత అతనికి ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో మెదక్‌, మంచిర్యాలలో ఇలాంటి తరహా చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. దొంగిలించిన సొమ్మును జల్సాలకు ఊయోగించే వాడని తెలిపారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.