గూడు కూలే…గోడు మిగిలే..

If the nest collapses... the wall will remain..– ఆర్థికంగా ఆదుకోవాలి
– మండల  తహశీల్దార్ బాధితులు వినతి
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో ఆదివారం రాత్రి అనుమాల కొమురక్క బాపు దంపతులకు చెందిన పెంకుటిల్లు,ఇంటి గోడలు పాక్షికంగా కూలిపోయాయి.ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.ఈ సందర్భంగా తమను ఆర్థికంగా ఆదుకోవాలని సోమవారం బాధితులు మండల తహశీల్దార్ రవికుమార్ కు వినతిపత్రం అందజేశారు.తాడిచెర్ల ఓసిపి బాంబు దెబ్బలతో ఇండ్లు ఇంటి గోడలు నెర్రెలు భారీ ఇండ్లు కూలిపోతున్నట్లుగా బాధితులతోపాటు, గ్రామస్థులు వాపోతున్నారు.డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లు సేకరించాలని పలుమార్లు జెన్కో అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఓసీపీకి డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లను, ఇంటి స్థలాలను జెన్కో కంపెనీ సేకరించి పరిహారం,ఆర్అండ్ఆర్ ప్యాకేజి వచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు భూ నిర్వాసితులు కోరుతున్నారు.