కాటాపూర్ ప్రభుత్వ గిరిజన బాలుర హాస్టల్ లో వైద్య శిబిరం 

Medical Camp at Katapur Govt Tribal Boys Hostelనవతెలంగాణ – తాడ్వాయి 
మండలంలోని కాటాపూర్ గిరిజన బాలుర హాస్టల్ లో సోమవారం కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రంజిత్ వైద్య శిబిరం నిర్వహించారు. పలువురు విద్యార్థులకు పరీక్షలు చేసి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మందులు పంపిణీ చేశారు. 50 మంది విద్యార్థులకు రక్త నమూనాలు సేకరించారు. మానిటరింగ్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్ సందర్శించి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించిన మానిటరింగ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ 
కాటాపూర్, తాడ్వాయి, కొడిశల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గల ఆశ్రమ పాఠశాలలో హాస్టల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను సందర్శించి పరిశీలించారు. విద్యార్థులకు పరీక్షించి మందులు అందిస్తున్న విధానాన్ని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.