– నల్ల బ్యాడ్జీలు ధరించి జూడాల నిరసన
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
ఇటీవల కోల్‌కత్తాలో వైద్యురాలిపై జరిగిన లైంగికదాడి, హత్య ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదిలాబాద్ రిమ్స్ జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి రిమ్స్ జూనియర్ డాక్టర్స్ క్యాంపస్ ఆవరణలో డాక్టర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని కోరుతూ గణేష్ మండపం వద్ద వైద్యులు పూజలు నిర్వహించారు. సుప్రీం కోర్టు తీర్పు తమ వైద్య ఆరోగ్య సమాజంలో తీవ్ర నిరాశను కలుగజేసిందన్నారు. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ వైఖరిని తాము కండిస్తున్నట్లు పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ఈనెల 17న ఉందని దేశ వ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ బాధితురాలికి న్యాయం జరిగేందుకు నిరసనకు దిగాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు. నిందితులను శిక్షించే వరకు నిరసనలు తెలుపుతాని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డా.అన్వేష్, డా. అభినరు, ప్రత్యుష, ప్రసన్న, శ్యామ్ ఉన్నారు.