నేలకొరిగిన మార్క్సిస్టు అగ్రశిఖరమా
కనుమరుగైన కాంతి పుంజమా
మార్క్సిస్టు సైద్ధాంతిక దిగ్గజమా..
మా అందరి సీతారామ్ ఏచూరీ..
విద్యార్థి దశనుంచే మొలకెత్తిన
చైతన్య ప్రజాస్వరమా!
పాలక దుశ్చర్యలను ఎండగట్టే
వీరోచిత ప్రజాగళమా!
సుదీర్ఘ రైతాంగ చారిత్రక ఆందోళనకు
తోడుగ నిలిచిన కార్మిక జన శ్రేణులు
కార్మిక కర్షకమైత్రి వికసించిన వేళ
నీవు నేర్పిన పోరు బాట ఫలితమే!
కార్పొరేటు, మతోన్మాద కలయికతో
మంటగలుస్తున్న మన ఘన వైవిధ్యం
ముందే గుర్తించిన దార్శనికుడా!
పార్లమెంటులోనూ, బయటా పోరుబాట తప్ప
వేరే మార్గం లేదని అదే శ్రామికజన
ఆయుధమని తేల్చి చెప్పి
ఎర్రజెండా చేతికిచ్చి
ముందుకు నడిపించిన
శ్రామికజన యోధుడా!
‘ఇండియా’ వేదికను ప్రజల దరి చేర్చిన
ప్రజల ఎజెండాకు రూపకర్త నీవే!
ఎన్నటికీ కనుమరుగు కావు నీ జ్ఞాపకాలు
బాధ్యతగా కృషి చేస్తాం నీ ఆశయసాధనకు
నీ ఆచరణ నీడలో సైద్ధాంతిక వెలుగులో!
– ప్రభాకర్