– ఎస్టీపీపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్‌రావు
నవతెలంగాణ-జైపూర్
మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశానికి అందించిన సేవలు మరువలేనివని జైపూర్ ఎస్టీపీపీ ఈడీ రాజశేఖర్‌రావు అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని సోమవారం ప్లాంట్ అదికారులతో కలిసి ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారత దేశానికి సంబంధించిన మొట్టమొదటి ఇంజనీర్ అని నీటి ప్రవాహానికి అనుగుణంగా ఆనకట్టకట్టి ఎటువంటి ప్రమాదం లేకుండా నీటిని నిల్వ చేస్తూ ఆటోమెటిక్‌గా గేట్ల వ్యవస్థను ఆయన రూపొందించారని పేర్కొనారు. మైసూర్ వద్ద గల కృష్ణరాజ సాగర్ ఆనకట్టలలో దీనిని బాగా వాడుకున్నారని, హైదరాబాద్ నగరాన్ని మూసీ నది వదరల నుంచి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించారని గుర్తు చేశారు. అదేవిధంగా విశాఖపట్నం రేవును సుముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపోందించడంలో ఆయన కీలక ప్రాత్ర పోషించారని తెలిపారు. సాంకేతికంగా భారతదేశం అభివృద్ధి చెందడంలో ఆయన ఎంతగానో కృషి చేశారని అన్నారు. అటువంటి మన మొదటి ఇంజనీర్ భారతరత్న మోక్షగుండం శిశ్వేశ్వరయ్య స్పూర్తిగా మనమంతా దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అదేవిదంగా మన దేశ అభివృద్దిలో ఇంజనీర్ల ప్రాత ఎంతో ఉందని, అంతరిక్ష పరిశోధనలో చంద్రయాన్, మంగళ్యాన్, అటల్ టన్నెల్, చినాబ్ రైల్వే బ్రిడ్జి ప్రపంచంలో అత్యంత ఎత్తైన పొడవైన బ్రిడ్జిని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక అభివృద్ధిలో 5వ స్థానంలో ఉన్న మనం 2047 నాటికి ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలువాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ జీఎం శ్రీనివాస్, చీఫ్ ఆఫ్ ఓఅండ్ఎం జేఎన్ సింగ్, ఏజీఎం సివిల్ ప్రసాద్, ఈఅండ్ఎం మదన్ మోహన్, సముద్రాల శ్రీనివాస్, ఎస్వోటూ ఈడీ ప్రభాకర్ రావు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఠాకూర్ మోహన్ సింగ్ పాల్గొన్నారు.