
మండలంలోని వివిధ గ్రామాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ కార్యాలయాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. తహసిల్దార్ కార్యాలయంలో మండల తహసిల్దార్ శేఖర్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ క్రాంతి, పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ రాజశేఖర్, మాక్లూర్ సహకార సంఘం లో చైర్మన్ బూరోల్ల అశోక్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏఒ పద్మ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలొ భాగంగా ఫ్లెక్సీ ని ఆవిష్కరించి, మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు, గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి రాకేష్, కరోబర్ శ్రవణ్, క్షేత్ర సహాయకులు రాజీనాథ్, తదితరులు పాల్గొన్నారు.