గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి  అరెస్ట్…

Man selling ganja arrested...నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్  అధికారి ఎస్. సైదులు ఆదేశాల మేరకు డిటిఎఫ్ భువనగిరి ఎక్సైజ్ టీం సోమవారం రోజున ముందస్తు సమాచారం మేరకు భువనగిరి పట్టణం లోని జంఖాన్ గూడ లో ఇంటి.నెం. 2-5-73 గల  ఒక ఇంటిలో సోదాలు నిర్వహించారు. అట్టి ఇంటిలో గంజాయి విక్రయిస్తున్న ఖోస్లాపార, సబ్దాల్పూర్ గ్రామం, మాల్దా జిల్లా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రమునకు చెందిన జహీర్ షేక్, తండ్రి: యాష్మిన్ షేక్ ను అదుపులోకి తీసుకుని అతని నుండి  సుమారుగా (100) గ్రాముల గంజాయిని  స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం అతన్ని భువనగిరి స్టేషన్ లో ఎక్సైజ్ ఎస్సై కి అప్పగించగా అతని పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండు కి పంపించడం జరిగిందనారు. ఈ సోదాలలో  డిటిఫ్ ప్రోహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రాధా క్రిష్ణ , వారి  ‌సిబ్బంది పాల్గొన్నారు. భువనగిరి ఎక్సైజ్ స్టేషన్ పరిదధిలో ఎవరైనా అక్రమంగా గంజాయిని విక్రయించిన, నిల్వ వుంచిన, మాదకద్రవ్యాలను మత్తు పదార్థాలను  సేవించడం నేరం అలాంటి వారి పై  కేసులు నమోదు చేసి  కఠిన చర్యలు తీస్కుకోవడం జరుగుతుంది అని జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్ అధికారి ఎస్. సైదులు  తెలిపారు.