ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో విమోచన దినోత్సవం

 Adilabadనవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
గత బీఆర్‌ఎస్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ అధికారంలో ఉండి కూడా విమోచన దినోత్సవ వాస్తవాన్ని గుర్తించలేక పోయాయని ఎంపీ గోడం నగేష్‌ ఆరోపించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల శంకర్‌తో కలిసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా మహానీయుల చిత్రపటాలకు పూజలు చేసినంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్‌ మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించకపోయిన మూడేండ్లుగా పీఎం పిలుపు మేరకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నామన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా సంవత్సర కాలం పాటు తెలంగాణ నిజాం పాలనలో ఉండేందన్నారు. తరువాత తెలంగాణ భారత దేశంలో వీలినం అయిందని, ఆ రోజునే విమోచన దినంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు.
హామీని విస్మరించారు..
ఎమ్మెల్యే పాయల మాట్లాడుతూ నిజాం పాలన నుంచి విముక్తి అయిన రోజును విమోచన దినంగా జరుపుతామని అధికారంలోకి రాకముందు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు లాలామున్న, ఆదినాథ్‌, వేదావ్యాస్‌, ఆకుల ప్రవీణ్‌, బీంసేనరెడ్డి, దయాకర్‌, దినేష్‌ మటోలియ, నగేష్‌, శ్రీనివాస్‌, రమేష్‌, దత్తు పాల్గొన్నారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో…
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ పట్టణశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు స్థానిక నేతాజీ చౌక్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. దీనికి ఏబీవీపీ పూర్వ నాయకులు దుర్శెట్టి నిఖిల్‌ పాల్గొని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భారతమాత నేతాజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ పట్టణాధ్యక్షులు డాక్టర్‌.రవికుమార్‌ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజానీకం విమోచన లభించిన సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినం వేడుకలు తెలంగాణ అంతట పండుగ వాతావరణంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. కుమురంభీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్వాయి పాపన్న మొదలగు నాయకులు వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిజాం నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసి ప్రాణాలను కోల్పోయారని అన్నారు. వారందరినీ స్మరిస్తూ ఆ మహనీయులకు ఘనంగా నివాళులర్పించాలని కోరారు. దేశ చరిత్రలో సెప్టెంబర్‌ 17కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ ఖాడ్సే అక్షరు, పూర్వ కార్యకర్తలు కార్తీక్‌, సాయి విద్యార్థులు పాల్గొన్నారు.
ముధోల్‌ : ముధోల్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో మంగళవారం బీజేపీ మండలాధ్యక్షుడు కోరి పోతన్న ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను ఎగుర వేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణలో పెద్ద పోరాటం జరగటంతో రజాకార్ల నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందని అన్నారు. ప్రతి సంవత్సరం తెలంగాణలో విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నర్సాగౌడ్‌, తాటివార్‌ రమేష్‌, సాయన్న, సప్పటోల్ల పోతన్న, శ్రీనివాస్‌, భూమేష్‌, లక్ష్మి నారాయణ, మోహన్‌ యాదవ్‌, సాయినాథ్‌, అంబర్‌ సింగ్‌ పాల్గొన్నారు.
వాంకిడి : మండలకేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో గణేష్‌ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎస్సై ప్రశాంత్‌ తెలిపారు. మండల కేంద్రంలోని గణేష్‌ మండపాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గణేష్‌ మండపాల కార్యకర్తలు సహకరించి శాంతియుతంగా వినాయకుల నిమజ్జనం చేయాలని ఆయన కోరారు.
పెంచికల్‌పేట్‌ : మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో వినాయకుడికి తొమ్మిది రోజుల పూజల అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాండ్‌ మేళాలు, డీజేలతో భక్తులు నృత్యాలు చేస్తూ గణనాథుడికి వీడ్కోలు పలికారు. ఆయా మండపాల వద్ద కమిటీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
నస్పూర్‌ : వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద వినాయక నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిమజ్జనానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. శోభయాత్ర కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్‌ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజలందరూ సామరస్యంతో నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, హిందూ ఉత్సవ సమితి ప్రతినిధుల పాల్గొన్నారు.
నార్నూర్‌ : మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో మండల నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. మహనీయుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పార్టీ మండల అధ్యక్షుడు తొడసం బండు, ఉపాధ్యక్షులు రాథోడ్‌ బిక్కు మాట్లాడుతూ ఆగస్టు 15 ఎంత ముఖ్యమో సెప్టెంబర్‌ 17 కూడా అంతే ముఖ్యమని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం నిర్వహిస్తోందన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను నిజాం చెరిపేసే ప్రయత్నం చేశారన్నారు. ఉద్దేశపూర్వకంగా చరిత్రను తొక్కి పెట్టీ మహనీయులు స్వాతంత్య్రం కోసం చేసిన త్యాగాలు, బలిదానాలు దాచడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నారు.