ఇది ప్రేక్షకుల విజయం

It's a crowd pleaserనరేశ్‌ వికె, రాగ్‌ మయూర్‌, ప్రియా వడ్లమాని లీడ్‌ రోల్స్‌ నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వీరాంజనేయులు విహారయాత్ర’. అనురాగ్‌ పలుట్ల దర్శకత్వం వహించారు. బాపినీడు.బి, సుధీర్‌ ఈదర సంయుక్తంగా నిర్మించారు. ఆగస్ట్‌ 14న ఈటీవీ విన్‌లో స్ట్రీమ్‌ అయిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకొని, రికార్డ్‌ బ్రేకింగ్‌ వ్యూస్‌, వాచ్‌ టైంతో బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యింది. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. నరేష్‌ వికె మాట్లాడుతూ, ‘ఈ సినిమా విషయంలో రెండు పెద్ద వ్యాఖ్యలు చేశాను. ఉషాకిరణ్‌కి ‘శ్రీవారికి ప్రేమలేఖ’ ఎంతో ఈటీవీ విన్‌కి ‘వీరాంజనేయులు విహారయాత్ర’ అంత పెద్ద సినిమా అన్నాను. అనురాగ్‌ వన్‌ అఫ్‌ ది బెస్ట్‌ స్క్రీన్‌ ప్లే రైటర్‌ అని చెప్పాను. ప్రేక్షకుల ఆదరణతో ఈ రెండు మాటలు ఫ్రూవ్‌ అయ్యాయి. 200 మిలియన్‌ స్ట్రీమింగ్‌ మినిట్స్‌తో సినిమా దూసుకుపోతోంది. బిగ్గెస్ట్‌ హిట్‌ ఇది. ఒక గౌరవాన్ని తెచ్చిన సినిమా. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇది ప్రేక్షకుల విజయం’ అని అన్నారు. ‘ఈ సినిమానికి ఇంత మంచి సక్సెస్‌ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. రవి ఈ సినిమాకి స్టార్టింగ్‌ పాయింట్‌. రాగ్‌ అందరినీ సర్ప్రైజ్‌ చేశాడు. ప్రియ అద్భుతంగా నటించింది. నరేష్‌ చాలా పాజిటివ్‌ పర్సన్‌. నేను పది సినిమాలు చేస్తే ఆ సినిమాలన్నిటిలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి వచ్చిన ప్రసంశలను మర్చిపోలేను’ అని డైరెక్టర్‌ అనురాగ్‌ చెప్పారు. ఈటీవీ విన్‌ బిజినెస్‌ హెడ్‌ సాయికష్ణ మాట్లాడుతూ,’ఆన్‌ పేపర్‌ ఇది బోల్డ్‌ సినిమా. ఇలాంటి సినిమా చేయడం చాలా కష్టం. ఈ సినిమాని అనురాగ్‌ నమ్మాడు. స్క్రిప్ట్‌ చదవి ఎలాగైనా చేయాలనిపించింది’ అని తెలిపారు.’సినిమా రిలీజైన దాదాపు నెల రోజుల తర్వాత సక్సెస్‌ సెలబ్రేట్‌ చేసుకుంటున్నామంటే.. ఇది ఆర్గానిక్‌ సక్సెస్‌’ అని ఈటీవీ విన్‌ కంటెంట్‌ హెడ్‌ నితిన్‌ చక్రవర్తి చెప్పారు.