విద్యార్థులకు బూట్లు పంపిణీ..

Distribution of shoes to students.నవతెలంగాణ – నవీపేట్
మండలంలోని నిజాంపూర్ ప్రాథమిక పాఠశాలలో జాతి  రత్నాలు యూత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బుధవారం బూట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాతి రత్నాలు యూత్ సభ్యులు రమేష్ మాట్లాడుతూ తమ యూత్ ద్వారా సేవా కార్యక్రమాలను చేసే ఉద్దేశంలో భాగంగా 63 మంది విద్యార్థులకు కోట్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మురళీధర్ రావు, రవీందర్ మరియు యూత్ సభ్యులు రవి, సంజీవ్, గంగారెడ్డి, సురేష్, సాయిలు, ప్రశాంత్, నరేందర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.