
– డిఎస్ఓ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
కష్టమెల్లింగ్ రైస్ డెలివరీని త్వరగా దిగుమతి చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు సూచించారు. బుధవారం ఎస్ డబ్ల్యూ సి, రామ్ లక్ష్మణ్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖరీఫ్ 2023 24 సంవత్సరానికి సీఎంఆర్ డెలివరీలో నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉందని తెలిపారు. సెప్టెంబర్ 30 లోపు ఖరీఫ్ 2023 24 సంబంధించి రైస్ మిల్లలకు కేటాయించిన టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశించారు. లేని పక్షంలో కమిషనర్ ఆదేశాల ప్రకారం 125 శాతం మిగిలిన సిఎంఆర్ డెలివరీ చేయవలసి ఉంటుందని రైస్ మిల్లర్లను హెచ్చరించారు.