– అన్ని కుటుంబాలను ఆదుకోవాలని తాసిల్దార్ కు వినతి
– చేసుకోవడానికి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటుండా గ్రామ ప్రజలు
– మిగిలిన కుటుంబాలను గుర్తించాలి
– రావిరాల గ్రామ ప్రజలు
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని రావిరాల గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇండ్లలోకి నీరు చేరి ప్రాణ భయంతో బ్రతికిన రావిరాల గ్రామ ప్రజలను అందరిని ప్రభుత్వన్ని ,అధికారులను స్వచ్ఛంద సంస్థలను రావిరాల గ్రామ ప్రజలు సుక్క స్వరూప, మార్క బుచ్చమ్మ ,తమ్మనపల్లి స్వాతి అపనపురి జయమ్మ, శ్రీరామ్ హైమావతి, గిరగాని భాగ్యమ్మ, అక్కర రాజమ్మ, రాస జానకమ్మ లు కోరినట్లు తెలిపారు. మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలోని డిప్యూటీ తాసిల్దార్ తరంగిణికి మమ్ములను ఆదుకోవాలని 200 మందితో కలిసి వినతి పత్రాన్ని అందించే కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు విపరీతంగా కురవడంతో మా గ్రామంలోకి ఇతర గ్రామాలలో సంబంధించిన వరదనీరు మరియు పైన ఉన్న రాజుల కొత్తపల్లి చెరువు తిరిగి మా ఊరి చేరులోకి వచ్చి చెరువు నుండి నీరు వదులుతంగా గ్రామంలోకి ప్రవేశించి ఇండ్లలో నీరు చేరి నిత్యవసర సరుకులు తోపాటు బియ్యం ఉప్పు, పప్పులు ఎలక్ట్రానిక్ వస్తువులు కొట్టుకపోయి నష్టపోయామని మరియు కొంతమంది ఇండ్లు నేలమట్టం అయ్యాయని కొంత మంది ఇళ్లలోకి నీటి నిలువ ఉండి మా ఇల్లు నాని కూలిపోయే ప్రమాదంలోకి వచ్చాయని మరియు నిత్యవసర వస్తువులు కొట్టుకపోవడంతో పాటు వారికి ఉన్నటువంటి ద్విచక్ర వాహనం మరియు ఆటోలు తోపాటు మేకలు, గొర్రెలు, బర్రెలు ఎన్నో రకాల రావిరాల గ్రామం నష్టపోయిందని కొంతమందిని గుర్తించి వారికి నిత్యావసర వస్తువులను ఇస్తున్నారని వారికి ఇస్తూ మిగిలిన మమ్ములను కూడా పూర్తిస్థాయిలో గుర్తించి మాకు నిత్యవసర వస్తువులను అందిస్తూ ఒక్కొక్క ఇంటికి ఖర్చుల నిమిత్తం కొంత డబ్బును ప్రభుత్వం తక్షణమే చెల్లిస్తూ ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ గ్రామానికి పైన ఉన్న చెరువు ఈ గ్రామానికి కింద ఉన్న కుంట రెండు తెగి మాకు ఉన్నటువంటి కొద్ది వ్యవసాయ భూములు వేసిన పంట మొత్తం కొట్టుకపోయి నష్టపోయామని అన్నారు కానీ ఇందులో కూడా కొంతమందిని గుర్తించారని అన్నారు. భూమి లేనివారు ఈ చెరువుల కుంటల కింద ఉన్నటువంటి వ్యవసాయ పంటలో పనులకు వెళ్లి ఊట గడుచుకుని కొన్ని కుటుంబాలు ఉన్నాయని ఈరోజు ఆల కూలికి వెళ్లడానికి కూడా సుమారు ఈ గ్రామం నాలుగు రోజులు నీటినిలో ఉందా అని అన్నారు. ఇప్పుడు చేతి పనులు చేసుకుందామని కూలీ పోదామన్నా వ్యవసాయ పంట లేక తినడానికి తిండి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. పూర్తిగా నష్టపోయిన వారికి ఇవ్వాల్సినటువంటి ఇస్తూ వారితోపాటు మిగిలిన కుటుంబాలకు చెందిన ప్రజలను కూడా ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం అధికార యంత్రాంగం కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని మా రావిరాల గ్రామాన్ని పూర్తిస్థాయిలో అన్ని కుటుంబాలకు అన్ని వర్తించే విధంగా కృషి చేయాలని కోరినట్లు గ్రామస్తులు తెలిపారు .ఈ కార్యక్రమంలో రావిరాల గ్రామ ప్రజలు మల్యాల రాజమ్మ వీరవల్లి ఉమారాణి చట్ల కిరణ్ మై కత్తుల స్వరూప అక్కర లక్ష్మి రుద్రాజ యాగమ్మ కడారి పూలమ్మ జక్కల మౌనిక అపడాపురి నర్సమ్మ వరుసు అమృత తోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.