నేడు చిన్నవంగరలో ‘భూ న్యాయ శిబిరం’

Land Justice Camp at Chinnawangara today– ఉచితంగా భూ సమస్యల పరిష్కార సేవలు
– లీఫ్స్ సంస్థ సలహాదారుడు కరుణాకర్ దేశాయ్ 
నవతెలంగాణ – పెద్దవంగర
భూసమస్యలను సృష్టించిన ధరణి పోర్టల్ను రద్దు చేసి దాని స్థానంలో భూమాతను తీసుకొస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేని ఫెస్టోలో హామీ ఇచ్చింది. అందులో భాగంగా లీఫ్స్ సంస్థ.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలాన్ని దత్తత తీసుకుని పది గ్రామాల్లో భూ న్యాయ శిబిరాలను నిర్వహించింది. భూ సమస్యలను గుర్తించి, రెవెన్యూ రికార్డులు పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి సమ ర్పించింది. అలాగే లీఫ్స్ సంస్థ గతంలో మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల పరిధిలోని చిన్నవంగర, బొమ్మకల్  గ్రామాలనూ దత్తత తీసుకుంది. ఇక్కడ కూడా సమస్యలను అధ్యయనం చేసి నివేదికను సర్కారుకు సమర్పించేం దుకు ఏర్పాట్లు చేస్తోంది.  నేడు చిన్నవంగ రలో ‘భూన్యాయ శిబిరం’ భూమి హక్కుల పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు లీఫ్స్ సంస్థ సలహాదా రుడు కరుణాకర్ దేశాయ్ బుధవారం తెలిపారు. భూ న్యాయ శిబిరానికి లీఫ్స్ అధ్యక్షుడు భూమి సునీల్ కుమార్, వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదం డరెడ్డి, తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం, సీఎంఆర్వో ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.లచ్చిరెడ్డి, రెవెన్యూ చట్టాల నిపుణులు హాజరు కానున్నారు.