– మండల విద్యాధికారి యాదవ రెడ్డి.
నవతెలంగాణ – తొగుట
నేటి నుండి మండల స్థాయి ఎస్జిఎఫ్ గేమ్స్ నిర్వ హిస్తున్నామని మండల విద్యాధికారి ఎస్ యాదవ రెడ్డి తెలిపారు. బుధవారం ప్రెస్ నోట్ ద్వారా తెలి పిన సమాచారం ప్రకారం తొగుట ఉన్నత పాఠశాల ఆవరణలో గురు, శుక్రవారం రెండు రోజుల పాటు ఆటల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గురు వారం అండర్ 14, 17 బాలికలకు, శుక్రవారం 14,17 బాలురకు వాలీబాల్, కబడ్డీ, కోకో పోటీలు నిర్వహిస్తామని అన్నారు. ఈ పోటీలకు మండలం లో ఉన్న ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్ ఆయా పాఠశాలలో ఉన్న విద్యార్థులను పాల్గొనేలా చూడా లని అన్నారు.