అమెజాన్‌ ఇండియా హెడ్‌గా సమీర్‌ కుమార్‌ నియామకం

అమెజాన్‌ ఇండియా హెడ్‌గా సమీర్‌ కుమార్‌ నియామకంన్యూఢిల్లీ : ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా హెడ్‌గా సమీర్‌ కుమార్‌ నియమితులయ్యారు. అక్టోబర్‌ ఒక్కటో తేది నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఆ కంపెనీ బుధవారం వెల్లడించింది. ప్రస్తుతం ఈ హోదాలో ఉన్న మనీశ్‌ తివారీ ఆగస్టు 6న రాజీనామా చేశారు. ఆ స్థానంలో సమీర్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. సమీర్‌ కుమార్‌ 1999 నుంచి అమెజాన్‌లో పని చేస్తున్నారు.