
పారదర్శక ఎన్నికలకు నిర్వహణకు, తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలని ఎంపీడీవో వేణుమాధవ్ కోరారు. గురువారం మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఓటరు జాబితా ను ఈ నెల 13 న ప్రచురించడం జరిగిందని తెలిపారు. గ్రామాల్లో లేనివారు, వివాహం చేసుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, చనిపోయిన వారి వివరాలను జాబితా నుండి తొలగించడానికి రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలన్నారు. ఓటరు జాబితా లో మార్పులు, చేర్పులకు సంబంధించిన అభ్యంతరాలను ఈనెల 21 వరకు స్వీకరిస్తామని పేర్కొన్నారు. అఖిలపక్ష నాయకుల సూచనలను పరిగణలోకి తీసుకుని ఈనెల 28 న తుది ఓటర్ జాబితాను ప్రకటిస్తామని ఎంపీడీవో తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు బైన బిక్షపతి, నాయకులు వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, దాసరి శ్రీనివాస్, బానోత్ సీతారాం నాయక్, బానోత్ గోపాల్, దేవేందర్, భాస్కర్, వెంకట్రామయ్య, సమ్మయ్య, వెంకన్న, లింగమూర్తి, బాలు తదితరులు పాల్గొన్నారు.