
సినిమా షూటింగ్లకు గజ్వేల్ అనుకూలంగా ఉందని మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్ పట్టణంలో శ్రీ జగన్మాతా రేణుక క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ రాజా మార్కండేయ సినిమా రీ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభోత్సవ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం గజ్వేల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంలో తీర్చిదిద్దరితోపాటు పార్కులు ఇతర వాటిని ఏర్పాటు చేశారని సినిమా నిర్మాతలను ఈ ప్రాంతం ఆకర్షిస్తుందని ఆయన చెప్పారు. అనంతరం మాజీ డిఎస్పి శ్రీధర్ రావు, మాజీ డైరెక్టర్ గోల్ సంతోష్, గంగిశెట్టి బిక్షపతి లో మాట్లాడుతూ.. గజ్వేల్ లో శ్రీ జగన్మాత రేణుకా క్రియేషన్స్ బ్యానర్ పై బన్నీ అశ్వంత్ దర్శకత్వంలో సామ శ్రీధర్, పంజాల వెంకట్ గౌడ్ , గౌరిశెట్టి శ్రీనివాస్ నిర్మాతలుగా ప్రొడక్షన్ నెంబర్ వన్ రాజా మార్కండేయ సినిమా రీ షెడ్యూల్ షూటింగ్ ఇక్కడ ప్రారంభించడం అభినందనీయమన్నారు. . యువ దర్శకుడు, యువ నిర్మాతల సారధ్యంలో తీస్తున్నటువంటి రాజా మార్కండేయ సినిమా సూపర్ హిట్ కావాలని ఈ సినిమాలో అందరూ నూతన నటీ నటులకు అవకాశం కల్పించిన యూనిట్ సభ్యులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సినీ నటులు తేజస్, నగేష్, శ్రీనివాస్ నాయుడు , ప్రత్యూష, దేవిక, సింగర్ నవీన్, ప్రశాంతి, మహేష్, రాధ, జోష్ణ ,రమ్య, సాయి, శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.