రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం..

Meeting with political party leadersనవతెలంగాణ – ముధోల్
మండల కేంద్రమైన ముధోల్ లో నీ మండల అభివృద్ధి కార్యాలయం లో గురువారం డిఎల్ పిఓ సుదర్శన్ పాటిల్ బనవత్, ఎంపీడీవో శివకుమార్ లు  ఓటర్ జాబితా పై వివిధపార్టీనాయకులతోసమావేశంనిర్వహించారు .త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు  వివిధ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించినట్లు డి ఎల్ పి ఓ  తెలిపారు .అయితే ఓటర్ల ముసాయిదా జాబితపై మాట్లాడారు. జాబితాలో ఏమైనా మార్పులు , తప్పులుంటే అభ్యంతరాలు చెప్పాలని సూచించారు.మండలంలో 19 గ్రామ పంచాయితీ లకు గాను 166 వార్డులు,గాను  28046 ఓటర్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల ఇంచార్జ్ బండారి గంగాధర్, కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జీ రావుల గంగారెడ్డి, బిజెపి నాయకులు ఎస్ పోతన్న ,డి శ్రీనివాస్ ,బీఎస్పి మండల నాయకులు ఎస్,సునీల్ కుమార్, సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు గంధం లింగన్న ,తదితరులు, పాల్గొన్నారు.