
నవతెలంగాణ – నెల్లికుదురు
పుట్టిన ప్రతి బిడ్డకు తల్లిపాలు 6 నెల లోపు వరకు కచ్చితంగా పట్టించాలని వావిలాల గ్రామ ఒకటవ అంగన్వాడి సెంటర్ టీచర్ నాలమస శ్రీలక్ష్మి అన్నారు. వావిలాల గ్రామంలో అంగన్వాడి సెంటర్ లో పోషకాహార మాస ఉత్సవాల సందర్భంగా సామూహిక అన్న ప్రసన్న కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పుట్టిన ప్రతి బిడ్డకు ఆరు నెలల్లోపు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి ఆరు నెలల తర్వాత అదనపు ఆహారం మొదలుపెట్టాలి అదనపు ఆహారంలో ఉండవలసిన పోషక విలువలు మరియు అంగన్వాడీ సెంటర్లలో అందించే అదనపు ఆహారం అందుతాయని అని అన్నారు. బరువు తక్కువ పిల్లలకు ఎస్ ఎస్ ఎఫ్ పీ న్యూట్రిషన్ ఫుడ్ మీద గర్భిణీ స్త్రీలకు బలంతులకు మహిళలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. దీనికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.