
ఉపాధ్యాయులు విద్యార్థులకు సృజనాత్మకతతో కూడిన విద్యను అందించాలని డీసీఇబీ సెక్రెటరీ గారె కృష్ణమూర్తి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్యపై ఆసక్తి కలిగించేలా బోధన చేయాలని సూచించారు. విద్యార్థుల్లో దాగిన విద్యా ప్రతిభను వెలికి తీసే బాధ్యత ఉపాధ్యాయుల పైనే ఉందన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పదిలో ఉత్తీర్ణత శాతం పెంచాలన్నారు. ఈ సమావేశంలో మండల నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఆర్పీలు బి రజినీకాంత్, వెంకటేశ్వర్ రావు, కే శ్రీనివాస్ రెడ్డి, వెంకటరమణ, సిఆర్పిలు రమేష్, వెంకన్న, ఎల్ల గౌడ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.