ఓటమి.. విజయానికి నాంది పలకాలి

Defeat should herald victory– ఎస్ జీఎఫ్ క్రీడల బహుమతుల అందజేతలో ఎమ్మెల్యే

– లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
నవతెలంగాణ – బెజ్జంకి
ఓటమి..విజయానికి నాంది పలకాలని మనకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విద్యార్థులకు సూచించారు.గురువారం మండల కేంద్రంలో బాలుర ప్రభుత్వోన్నత పాఠశాల క్రీడా మైదానంలో బాలికల ఎస్ జీఎఫ్ క్రీడల విజేతలకు బహుమతుల ప్రధానోత్సవానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హజరై క్రీడల్లో ప్రతిభ కనబరిచిన ఆదర్శ విద్యాలయం,బేగంపేట, బెజ్జంకి ప్రభుత్వోన్నత పాఠశాల విద్యార్థులకు మేడల్స్ అందజేసి షీల్డులను బహుమతిగా అందజేశారు.అంతకుముందు ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్మాణం పూర్తయిన మూత్రశాలల,బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించారు.ఎంఈఓ పావని, మండలాధ్యక్షడు రత్నాకర్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్,నాయకులు,అయా పాఠశాలల ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
జీడబ్ల్యూసీ అధ్వర్యంలో సన్మానం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీ అమలుకు జీఓ జారీ చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ జీడబ్ల్యూసీ అధ్వర్యంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను శాలువ కప్పి సన్మానించారు.జీడబ్ల్యూసీ జిల్లాధ్యక్షుడు బుర్ర తిరుపతి,కర్రావుల సంజీవ్,వడ్లూరి రామచంద్రం, చిలిముల కిష్టయ్య,కర్రావుల తిరుపతి,కొర్వి కొంరయ్య,గొడుగు తిరుపతి హజరయ్యారు.