
మండలంలోని వివిధ గ్రామాలలో ఆయా గ్రామాలకు సంబంధించిన ఓటర్ లిస్ట ఈనెల 13వ తేదీన ప్రకటించామని వాటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలుపాలని ఎంపీడీఓ బాలరాజు తెలిపారు ఎంపీ ఓ పద్మ తో కలిసి గురువారం వివిధ రాజకీయ పార్టీల అధ్యక్ష కార్యదర్శులకు సమావేశాన్ని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని వివిధ గ్రామాలలో ఆయా గ్రామాలకు సంబంధించిన వార్డుల వారీగా ఓటర్ లిస్టును ఈనెల 13వ తేదీన ఆయా గ్రామ పంచాయతీల ఆవరణలో ప్రకటించామని, అందులో ఏమైనా సవరణలు ఉంటే తెలిపినట్లైతే వాటిని సరి చేయవచ్చన్నారు. ఈనెల 21వ తేదీ వరకు అవకాశం ఉందని తెలిపారు. దీనిని ప్రతి ఒక్క రాజకీయ పార్టీల అధ్యక్ష కార్యదర్శులు తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా రాజకీయ పార్టీల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.