జన్నారం మండలంలోని మొర్రిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ గోండుగూడాలను కలుపుతూ నూతన గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు శుక్రవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేలు వినతి పత్రం అందించారు. ప్రేమ్ సాగర్, గంగారాం కాంతారావు భీమన్న,ఇందూర్ పోశం శ్రీనివాస్ భీమన్న,నరసయ్య ప్రశాంత్ రాజన్న, మల్లే శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఆ రెండు గూడాలలో దాదాపు 600 జనాభా ఉన్నారని, గ్రామపంచాయతీకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండడం చేత అభివృద్ధి జరగడం లేదన్నారు.అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే నూతన గ్రామపంచాయతీ ఏర్పాటుకు సహకరించాలని ఎమ్మెల్యేని కోరారు.