ఈ పాస్ పోర్టల్ నందు దివ్యాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి

– జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
 అర్హులైన దివ్యంగా విద్యార్థిని విద్యార్థులు తమ తమ దరఖాస్తులను 2024-25  సంవత్సరానికి గాను, నూతన, రెన్యువల్ దరఖాస్తు చేసుకునే వారు  ఈ పాస్ పోర్టల్ వెబ్సైట్ http:/telanganepass.cgg.gov.in నందు ఆన్లైన్ ద్వారా స్కాలర్షిప్ పొందు తగ్గాను తమ దరఖాస్తులను అప్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ అవకాశాన్ని  జిల్లాలోని అర్హులైన దివ్యాంగ విద్యార్థిని విద్యార్థులందరూ ఉపయోగించుకుని కింద సూచించబడిన తేదీలలో దరఖాస్తు చేసుకున్న వలసిందిగా , పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కొరకు ఓపెనింగ్ పోర్టల్ సెప్టెంబర్ 1,  2024 నుంచి 31 డిసెంబర్ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.