నవతెలంగాణ – నవీపేట్: పదోన్నతి పై వెళ్తున్న ఎస్సై రాజారెడ్డిని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ యుఐ మండల అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ.. గత 16 నెలలుగా మండలంలో సేవలందించి సీఐగా పదోన్నతి పొందడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సతీష్ , దిలీప్, రంజిత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.