25న మండల స్థాయి కోకో క్రీడాకారుల ఎంపిక

నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలో ఉప్పల్వాయి జిల్లా పరిషత్ పాఠశాలలో ఈనెల 25వ తేదీన మండల స్థాయి కోకో క్రీడాకారుల ఎంపికను నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్ రావు మండల సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ సాయి మౌర్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ బాల బాలిక 17 సంవత్సరాలు 01-01- 2008 తర్వాత జన్మించిన వారై ఉండాలి. సబ్ జూనియర్ 14 సంవత్సరాలు, 01- 01- 2011 తర్వాత జన్మించి ఉండాలని, పాల్గొని క్రీడాకారులు బోనఫైడ్ సర్టిఫికెట్లను ఉప్పల్వాయి జిల్లా పరిషత్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ అశోక్ కు అందజేయాలని సూచించారు.