చదువుతో పాటు ఆటల్లో ముందుండాలి: దుర్గాప్రసాద్

Be ahead in sports along with studies: Durgaprasadనవతెలంగాణ –  ఆర్మూర్ 

నేటి కాలంలో విద్యార్థిని విద్యార్థులు చదువుతూ పాటు ఆటపాటల్లో సైతం ముందుండాలని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గ ప్రసాద్ అన్నారు. 68వ ఎస్ జి ఎఫ్ ఆలూర్ మండల అంతర పాఠశాలల క్రీడోత్సవాలు శుక్రవారం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిర్తాపల్లి లో నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ  నేడు గ్రామీణ స్థాయిలో ఎందరో విద్యార్థిని విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చూపడం అభినందనీయమని అన్నారు .ఈ కార్యక్రమంలో పి ఆర్ టి య జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి నరేష్ ,రెవెన్యూ డివిజనల్ అధికారి రాజా గౌడ్, మండల విద్యాధికారి రాజా గంగారం, ఆలూరు మండల కాంప్లెక్స్ హెచ్ఎం నరేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుంట శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.