
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మోత్కూర్ రోడ్డులో కాంగ్రెస్ నాయకులు సంకెపెల్లి రఘునందన్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్.ఆర్ రెడ్డి ఫ్రెష్ చికెన్ సెంటర్ ను శుక్రవారం మున్సిపల్ చైర్మన్ శాగంటి అనసూయ రాములు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. చికెన్ సెంటర్ మంచి లాభాలతో ముందుకు కొనసాగాలని భగవంతుని కోరుకున్నారు.అనంతరంచికెన్ సెంటర్ యజమాని సంకేపల్లి రఘునందన్ రెడ్డి వారిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్ బత్తుల శ్రీనివాస్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.