నవతెలంగాణ – అశ్వారావుపేట : ఇటీవల జరిగిన పోలీస్ శాఖ సాదారణ బదిలీల్లో ఖమ్మం ఒన్ టౌన్ ఎస్సైగా పని చేస్తున్న యయాతి రాజు ఆశ్వారావుపేట ఎస్సైగా నియమితులు అయ్యారు. ఆయన శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్.హెచ్.ఓ గా బాధ్యతలు స్వీకరించారు. కాగా ఇక్కడ ఎస్సైగా పని చేసిన శ్రీరాముల శ్రీనివాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.నాటి నుంచి ఎస్సై పోస్టు ఖాళీగా ఉండగా, ఉన్నతాధికారులు యయాతి రాజును నియమించారు.దీంతో ఆయన విధుల్లో చేరారు. 2020 బ్యాచ్ కు చెందిన యయాతి రాజు వరంగల్ జిల్లా నల్లబెల్లి వాసి.ఈయన మొదటి పోస్టింగ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా కొణిజర్ల,తర్వాత ఖమ్మం ఒన్ టౌన్ ప్రస్తుతం అశ్వారావుపేట లో ఎస్.హెచ్.ఒ బాధ్యతలు చేపట్టిన ఆయనను అదనపు ఎస్సై శివరామకృష్ణ, ఏఎస్ఐ యాకూబ్ అలీ తో పాటు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.