నేను చివరిసారి కామ్రేడ్ సీతారాం ఏచూరితో ఆగస్టు 22న మాట్లాడాను. కామ్రేడ్ బుద్ధదేవ్ సంస్మరణ సభ కోసం ఆయన వీడియో మెసేజ్ రికార్డుచేసి పంపమన్నాను. అప్పుడే ఐసీయూ నుండి బయటికొచ్చిన ఆయన వెంటనే అంగీకరించారు. ఎంతసేపు మాట్లాడాలని కూడా ఆయన వాకబు చేశారు. ఆయన భార్య సీమా, నేనూ ఇరువురమూ ఆయన ఆరోగ్యం ఎంతసేపు అనుమతిస్తే అంతసేపే మాట్లాడమని చెప్పాం.
మధ్యాహ్నం నేను నేతాజీ ఇన్‌డోర్ స్టేడియంలో వేలాదిగా అక్కడ జమ అయిన పార్టీ కార్యకర్తలను, అభిమానులను ఉద్దేశించి దాన్ని ప్రసారం చేయాలని అడిగేటప్పుడు అదే ఆయన చిట్టచివరి ఉపన్యాసమని నేనూ భావించలేదు. బుద్ధదేవ్ గురించి కామ్రేడ్ సీతారాం చెప్పే మాటలను రాసుకుంటూనే ఆస్పత్రి బెడ్‌లోని ఆయన చివరి విశేషమైన ఫొటో సీమ తీసింది.
సీతారాం యేచూరి చాలా తొందరగా వెళ్ళిపోయాడు. పార్టీకి, భారత వామపక్ష ఉద్యమానికి, బెంగాల్‌కు, అన్నింటికీ మించి ఇండియాకు ఆయన అవసరం ఉండింది.
బహుముఖ ప్రజ్ఞాశాలి
ఆయనలాంటి స్థాయున్న వ్యక్తికి నివాళి అర్పించడం కష్టం. సీతారాం ఏచూరి ఒక మార్క్సిస్టు లెనినిస్టు, ఒక సిద్ధాంతవేత్త, ఆర్థిక శాస్త్రవేత్త, చరిత్ర కారుడు, క్రియాశీల కార్యకర్త, అన్నిటికంటే ముఖ్యంగా ఆచరణవాది. భారతదేశ బహుళత్వమంటే ఆయనకి తెగమక్కువ. దాన్ని కాపాడ్డానికి ఆయన అహరహం కృషి చేశారు.
చదువు – పోరాడు : పెద్ద చరిత్రకారుడు
చదువు – పోరాడు అనే ఎస్‌ఎఫ్‌ఐ నినాదానికి సీతారాం నిలువెత్తు రూపం. 1970లలో ‘స్టూడెంట్ స్ట్రగుల్’ పత్రిక సంపాదకుడుగా దేశంలో కమ్యూనిస్టుల చరిత్రకు సంబంధించిన వాస్తవాలను వెలికితీసి వాటిని వాటి యధాస్థానంలో ఉంచేందుకు ఆయన తన నిశిత దృష్టిని కేంద్రీకరించారు. అదేసమయంలో ఆర్‌ఎస్‌ఎస్ భగత్‌సింగ్‌ను సొంతం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలను ఆయన వమ్ముచేశారు. భగత్‌సింగ్ ఒక విప్లవకారుడని, నాస్తికుడని, కమ్యూనిస్టని రుజువుచేసే అనేక చారిత్రక వాస్తవాలను దాన్లో ప్రచురించారు. ఆనాటి, అనేకమంది కమ్యూనిస్టు యోధులవలె జాతీయోధ్యమ సాంప్రదాయాలను మున్ముందుకు తీసుకెళ్ళేందుకు ఆయన పతాకధారియై నిలిచాడు. కమ్యూనిస్టుల ప్రతిష్టాత్మక చరిత్ర, దేశ ప్రధాన స్రవంతి గుర్తింపులోకి తేబడింది. దానికి ఆయన మేథోపరమైన కార్యాచరణ ఎంతో తోడ్పడింది. అండమాన్‌లోని సెల్యులార్ జైలు విశేషాలను పార్లమెంటు రికార్డుల నుంచి తవ్వి తీయడానికి ఆయనతో కలిసి నేనూ చేసిన కృషి ద్వారా జాతీయోధ్యమంలో కమ్యూనిస్టుల పాత్రను సమున్నతంగా నిలిపేందుకు తోడ్పడింది.
మార్క్సిస్టు సిద్ధాంతవేత్త, ప్రజామేధావి, మాటకారి
మాకినేని బసవపున్నయ్య, ఇ.ఎమ్.ఎస్., సూర్జిత్, జ్యోతిబసు వంటి ప్రతిష్టాత్మక నేతల శిక్షణలో కమ్యూనిస్టు ఉద్యమంలోకి సీతారాం ప్రవేశించారు. ఫలితంగా సైద్ధాంతిక కమిట్‌మెంట్ ఆయనకు అలవడింది. ప్రజల్ని ఐక్యం చేయడం నేర్చుకున్నారు. కరకు రాజకీయాలను తన మేధోశక్తితో, నైపుణ్యంతో దారికి తేగలగడం ఆయన మనకు వదిలివెళ్ళిన వారసత్వం.
కాంగ్రెస్‌లో తిరుగుబాటు బావుటా ఎగరేసిన వి.పి.సింగ్, బహుగుణలు 1987లో కోలకతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో ఒక మీటింగ్ నిర్వహించారు. జ్యోతిబసు, సీతారామ్‌లతో ప్రఖ్యాత జేఎన్‌యూ ప్రొఫెసర్ అక్కడున్నారు. నేను డీవైఎఫ్‌ఐ నాయకుడిగా అక్కడ వలంటీర్ బాధ్యతల్లో ఉన్నాను. హఠాత్తుగా సీతారాం నన్నుద్దేశించి ”రాజకీయాల కోసం పిహెచ్.డిని పక్కన పడేసినందుకు నీ వల్ల నేను కూడా తిట్లు తినాల్సి వచ్చిందిరా!” అన్నారు. ఏదిఏమైనా, ఆయన విలువైన మేధావేకాదు, విద్యావేత్త కూడా. 20వ శతాబ్దంలో జరిగిన – సోవియట్ కూలిపోవడం, బాబ్రీ విధ్వంసం, సరళీకృత ఆర్థిక విధానాల ప్రారంభాన్ని అద్భుతంగా సిద్ధాంతీకరించారు. మార్క్సిస్టు లెనినిస్టు సిద్ధాంత సాయంతో ఒక యువ పొలిట్ బ్యూరో సభ్యునిగా సీతారాం ఆ చారిత్రక సందర్భంలో అవి మన దేశంలో ఎటువంటి ఆర్థిక నమూనా మార్పులకు దారితీస్తాయో ప్రజలకు వివరించారు. సీతారాం యేచూరి పిహెచ్.డి చేయలేదు. కాని ఆయన రాసిన వ్యాసాలు, ఉపన్యాసాలు, పార్టీ తీర్మానాలు ఆయన్ని ఒక మేధావి రాజకీయవేత్తగా, ‘సిద్ధాంతవేత్తగా, మాటల మాంత్రికుని’గా నిలుపుతాయి.
సంకీర్ణాల నిర్మాత, బహుళత్వం కోసం, సంక్షేమ రాజ్యం కోసం పోరాడిన యోధుడు
80, 90 దశకాల్లో అస్సాం, పంజాబ్‌ల్లో వేర్పాటువాద ఉద్యమాలు పెల్లుబుకడం, బీజేపీ తన మతోన్మాద కోరలు చాచడం, కాంగ్రెస్ అవినీతి సంక్షోభంలో కూరుకుపోవడం – ఆ దశలో మన సీనియర్ నేతల మార్గదర్శకత్వంలో యూపీఏ-1 ఏర్పాటులో సీతారాం ప్రధానపాత్ర పోషించారు. అదే సందర్భంలో ఆయన మైనారిటీల హక్కులు, భారతదేశ భిన్నత్వ రక్షణ, మతోన్మాదంపై పోరాడే సేనానిగా నిలిచారు.
వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వకాలంలో హిందూత్వ అసలు స్వరూపాన్ని బహిరంగపరచడంలో సీతారాం కీలక భూమిక పోషించారు. నేటి ఉధృత పద్ధతుల్లోగాక, ప్రచ్ఛన్న రూపాల్లో ఆనాడు మతోన్మాదం ఉండింది. దానిపై సీతారాం అలుపెరుగని పోరాటం చేశారు. యూపీఏ-1 కాలంలో సీతారాం ప్రధానంగా సంక్షేమ రాజ్యంపై కేంద్రీకరించారు. పౌర సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలు, ప్లానింగ్ కమి షన్ వంటి వాటన్నిటినీ కలిపి సీతారామ్ ఒక నెట్‌వర్క్ చేశారు. విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకుని ఉపాధి హామీ చట్టం, ఆహార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం వంటి వాటి ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించారు. మతోన్మాదంపై పోరాటమేగాక, కార్మికుల, రైతుల హక్కుల రక్షణకై సంక్షేమ రాజ్యాన్ని కాపాడటానికి ఆయన ప్రయత్నిస్తూనే ఉండేవాడు.
కల్లోల దశాబ్దంలో అసాధ్యమైన వృత్తి
2014-24 మధ్యకాలం పార్టీకి, వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమానికి, ప్రధాన కార్యదర్శిగా సీతారామ్ యేచూరికి నిస్సందేహంగా పరీక్షా సమయమే. మోడీ ప్రభుత్వం నిరంతర దాడుల నేపథ్యంలో కమ్యూనిస్టులే కాదు, కమ్యూనిస్టులుగా భావించబడే వారు సైతం ధైర్య సాహసాలను, తెలివితేటలను, ఓపికను ప్రదర్శించాలి. ఎన్నికల్లో ఎదురుదెబ్బలు ఎదురైనా దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని సజీవంగా, దృశ్యమానంగా, బలంగా, సచేతనంగా నిలిపేందుకు సీతారాం కృషి తోడ్పడింది. సైద్ధాంతికంగా బలమైన, రాజకీయంగా నిబద్ధమైన, అందరికీ ఆమోదయోగ్యమైన, సాంస్కృతికంగా నిర్మలమైన ప్రకాశవంతమైన మోము ఆయన కాలానికి చెందిన నెలబాలునిగా సీతారామ్ ఎప్పటికీ గుర్తుండిపోతారు.
మొహమ్మద్ సలీం