నాలుగు డీఏలు విడుదల చేయాలి : టీపీటీఎఫ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉద్యోగులకు బకాయిపడిన నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి పి నాగిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులకు గత ప్రభుత్వంలోనే మూడు డీఏలు పెండింగ్‌లో ఉంటే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక మరో రెండు డీఏలు బకాయి పడిందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తయినా నేటికీ డీఏలు ప్రకటించలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం వేసిన పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకునే ఆలోచన చేయడం లేదని తెలిపారు. మంత్రివర్గంలో ఉద్యోగులకు కనీసం రెండు డీఏ ప్రకటిస్తుందంటూ ఆశించిన వారికి నిరాశే కలిగించిందని పేర్కొన్నారు.