ఎమ్మెల్యేకు పలు సమస్యలపై బినోల సర్పంచ్ వినతి

నవతెలంగాణ – నవీపేట్: బోధన్ ఎమ్మెల్యే షకీల్, ఆమేర్ ఆయన నివాసంలో దినోల గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి బుధవారం పది సమస్యలపై వినతిపత్రం అందించారు. బినోల గ్రామంలోని చెరువు కట్ట పెద్ద తూము, కాసరబాద్ చెరువు కట్ట పెద్ద తూము, గాంధీనగర్ నుండి బినోలా వరకు డబుల్ రోడ్డు మరియు బినోల బైపాస్ రోడ్డు పనులను చేయించాలని బుధవారం విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువా, బొకేతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పీతాంబర్, డైరెక్టర్ విజయ్ మరియు గ్రామ పెద్దలు ఉన్నారు.