తెలంగాణ ఉద్యమ నేత బద్దుల సత్యనారాయణ యాదవ్ హఠత్మరణం 

నవతెలంగాణ- అంబర్‌పేట: తెలంగాణ కోసం అనేక మార్లు ఉద్యమల్లో చురుగ్గా పాల్గొని జైలుకు వెళ్లిన వ్యక్తి బద్దుల సత్యనారాయణ యాదవ్(95) శుక్రవారం సాయత్రం 4 గంటలకు కన్ను మూశారు . బద్దుల సత్యనారాయణ యాదవ్ కి  భార్య, నలుగురు కోడుకులు రవీందర్ యాదవ్, జగ్గుయాదవ్, డాక్టర్ ఓం ప్రకాష్ యాదవ్. ప్రత్యేక రాష్ట్రమే ధ్యేయంగా తెలంగాణ ప్రజలతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. సత్యనారాయణ యాదవ్ హఠత్ మరణం కుటుంబసభ్యుల తో పాటు కాచిగూడ  డివిజన్లో   తీవ్ర విషాదంలో ముంచింది. యాదవ సంఘానికి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు నిరంతరం పేదల ప్రజల సంక్షేమ కోసం దేవాలయాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్,యాదవ సంఘం పెద్దలు పలువురు రాజకీయ ప్రముఖులు సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. యాదవ సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరుగా, పెద్దదిక్కుగా ఉన్నారు.