యువత దేశ భక్తిని పెంపొందించుకోవాలి: ఎస్సై

Youth should develop patriotism: Essay– ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్
నవతెలంగాణ – నెల్లికుదురు 
ప్రజలు, యువత దేశ భక్తిని పెంపొందించుకోవాలని నెల్లికుదురు ఎస్ఐ సిహెచ్. రమేష్ బాబు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ లు అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసి, పూలమాలవేసి, ఆయన సేవలను శనివారం గుర్తుకు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు ప్రాణాలర్పించారని, వారి ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. స్వాతంత్ర్య సమర యోధుల జీవిత చరిత్ర నేటి యువతకు స్పూర్తిదాయకమన్నారు. దేశ భవిష్యత్తు యువత పైన ఆధారపడి ఉందని కావున యువత చెడు వ్యసనాలకు గురికాకుండా దేశ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బంటు కవిరాజు, ముక్కెర ప్రకాష్ బాబు, రఘురాం, భూక్యా నాగేశ్వరరావు, పెద్దూరి వెంకటేశ్వర్లు, కక్కెర్ల రామ్మూర్తి, దూపటి శ్రీనివాస్, ఎనమాల సుధాకర్, లాడే మహేందర్, కందికొండ బాబు, కూన సతీష్, దేశెట్టి యాకన్న, అధ్యాపకేతర బృందం ప్రదీప్, లక్ష్మణ్, గౌరీ శంకర్, ఎన్.స్.స్ వాలంటీర్లు మాధవి, వర్షిత, నందీశ్వర్, నవీన్, నరేష్, లోకేష్, శ్రీధర్, రాజేష్, సురేష్ విక్రమ్ తదితరులు పాల్గోన్నారు.