ఎస్‌బీఐ లైఫ్‌ కొత్త క్యాంపెయిన్‌

హైదరాబాద్‌: ప్రయివేటు బీమా కంపెనీ ఎస్‌బీఐ లైఫ్‌ ‘కలలు కంటే నిజం చేసుకోండి’ పేరుతో కొత్త ప్రచార క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ప్రతీ ఒక్కరూ తమ కలలను నెరవేర్చుకునే ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుందని ఆ సంస్థ పేర్కొంది. ”ఎస్‌బీఐ లైఫ్‌ ఎల్లప్పుడూ వినియోగదారుల మారుతున్న అవసరాలను అర్థం చేసుకోవడానికి చాలా ఆసక్తితో ఉంటుంది. కొత్త క్యాంపెయిన్‌ వినియోగదారులకు ప్రేరణను ఇస్తోంది.” అని ఎస్‌బీఐ లైఫ్‌ కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌, సీఎస్‌ఆర్‌ బ్రాండ్‌ చీఫ్‌ రవీంద్ర శర్మ పేర్కొన్నారు.