జ్ఞానానికి పుట్టినిల్లుగా ఎన్నో ఏళ్ల పాటు ఇండియా విరాజిల్లింది. ఇక్కడ ఉన్న ఎన్నో పురాతన దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు అనంతమైన జ్ఞానానికి ప్రతీకలు. అలాంటి వాటిల్లో అతి ముఖ్యమైనది నలంద విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయ గ్రంథాలయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
క్రీ.శ. 427 సంవత్సంలో (ప్రస్తుతం – రాజ్‌గిర్), పాటలీపుత్ర (ప్రస్తుతం – పాట్నా) సమీపంలో నలంద విశ్వవిద్యాలయాన్ని కుమార గుప్తా-1 అనే రాజు కట్టించారు. ఈ విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే తొలి నివాస విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది. అంతేకాక ప్రపంచంలో మొట్ట మొదటి విశ్వవిద్యాలయంగా కూడా నలంద చరిత్రలో నిలిచిపోయింది. సంస్కృతంలోని న, ఆలం, ద, అనే మూడు సంస్కృత అక్షరాల ద్వారా విశ్వవిద్యాలయంకి నలంద అనే పేరు వచ్చింది. న ఆలం ద.. అంటే దారళంగా ప్రవహిస్తున్న జ్ఞానం అని అర్థం.
ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా కొరియా, జపాన్, చైనా, టిబెట్, ఇండోనేషియా, పర్షియా, టర్కీ, బాబిలోనియా, గ్రీస్, సిరియా, అరేబియా, ఫెనిసియా దేశాలనుండి కూడా ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. ఇందులో 10,500 మంది విద్యార్థులు ఉండేవారు. ప్రపంచానికి సున్నాను పరిచయం చేసి, ఖగోళ రహస్యాలను తెలిపిన ‘ఆర్యభట్ట’ లాంటి ఎంతోమంది గొప్పవాళ్ళకు నిలయమై, వారి నేతత్వంలో నడిచినట్లు చెప్తారు. నాగార్జునాచార్యుడు ఇందులో బోధించాడు. అలాంటి ఆచార్యులు 2000 మంది ఉండేవారు.
ఈ విశ్వవిద్యాలయంలో వైద్యం, తర్కం, గణితం నేర్చుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన పోటీ ఉండేది. దానికోసం విద్యార్థులకు పరీక్షలు పెట్టి, మౌఖిక పరీక్షలు నిర్వహించి విశ్వవిద్యాలయంలోకి ప్రవేశం ఇచ్చేవారు. ఇప్పుడు ఉన్నత శ్రేణి విశ్వవిద్యాలయాల మాదిరిగానే అప్పట్లో నలందలో ప్రవేశం దొరకడం చాలా కష్టం. మాస్టర్స్ ప్యానెల్లో కౌటిల్య (అర్థశాస్త్ర రచయిత), పాణిని (సంస్కృతాన్ని నేటి రూపంలోకి క్రోడీకరించేవారు), జీవక్ (ఔషధం), విష్ణు శర్మ (పంచతంత్రం) బుద్ధకళతి, కాండ్రోగోథిన్, నాగార్జున, ఆర్యదేవ, వసుబంధు, అసంగ, స్థిరమతి. ధర్మపాలుడు, శిలభద్ర, శాంతిదేవ, శాంతరక్షిత, పద్మసహిబిహావ, కామశిలవంటి ప్రఖ్యాత పేర్లు ఉన్నాయి. ప్రవేశం పొందిన విద్యార్థులకు ధర్మపాల, సిలభద్ర వంటి బౌద్ధ గురువుల మార్గదర్శకత్వంలో పండితుల బృందం మార్గదర్శకత్వం వహించింది.
గ్రంథాలయం: ఇది ప్రపంచంలోనే పెద్ద గ్రంథాలయంగా వర్ధిల్లింది. ఈ విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో చేతితో రాసిన తాళపత్ర రాతప్రతులు తొమ్మిది మిలియన్లు వున్నాయి. ఈ లైబ్రరీని ‘ధర్మ గంజ్/ సత్య పర్వతం/ మౌంటైన్ ఆఫ్ ట్రూత్’ అని పిలుస్తారు. ఇది బౌద్ధ విజ్ఞానానికి గొప్ప రిపోజిటరీగా మారింది. వాటిలో కొన్ని అత్యంత పవిత్రమైన మాన్యుస్క్రిప్ట్‌లు ఉన్నాయి. రత్నోదధి’లో (ూవa శీట జీవషవశ్రీర) తొమ్మిది అంతస్తుల భవనంలో చేతితో రాసిన తాళపత్ర రాతప్రతులు, పుస్తకాలూ నిల్వ చేశారు. వేదాలు, భాష, వ్యాకరణం, తత్వశాస్త్రం, వైద్యం, శస్త్రచికిత్స, విలువిద్య, రాజకీయాలు, యుద్ధం, ఖగోళశాస్త్రం, జ్యోతిష్యం, ఖాతాలు, వాణిజ్యం, భవిష్యత్తు శాస్త్రం, డాక్యుమెంటేషన్, క్షుద్ర, సంగీతం, నృత్యం వంటి విభాగాల రాత ప్రతులు గ్రంథాలయంలో అందుబాటులో ఉండేవి. మూడు అంతస్తులో లక్షల పుస్తకాలతో ఈ గ్రంథాలయం ఉంది.
రత్నసాగర్ (శీషవaఅ శీట జీవషవశ్రీర) భవనంలో పురాతనమైన రేర్ కలెక్షన్, పవిత్రమైన కలెక్షన్ ప్రజా పారమిత్ర సూత్ర, తాంత్రిక పుస్తకాలు ఉన్నాయి
రత్నరంజక (జీవషవశ్రీ-aసశీతీఅవస) జ్ఞాన దేవాలయంలో మహాయన హీనాయన సాంప్రదాయాలకు సంబంధించిన అనేక బౌద్ధ గ్రంథాలు ఉండేవి. బౌద్ధమతానికి, బ్రాహ్మణ మతానికి సంబంధించిన గ్రంథ సముదాయం ఉండేది. ఇది బౌద్ధ అధ్యయనాలకు, ఖగోళ శాస్త్రం, వైద్యం, తర్కం, గణితానికి సంబంధించిన రాతప్రతులు ఈ భవనంలో అందుబాటులో ఉండేవి. ప్రాచీన గణితం, సైన్సు, ఖగోళ శాస్త్రం, ఆయుర్వేద వైద్య పద్ధతుల రాత ప్రతులు ఇందులో వున్నాయి.
హూయన్ సాంగ్ ప్రకారం 18 రకాల చేతి రాతప్రతుల పుస్తకాలు వేదాలు, హేతు విద్య, శబ్ద విద్య, చికిత్స విద్య, అధర్వ విద్య, సాంఖ్యకు సంబంధించిన పుస్తకాలు, సూత్రాస్ అండ్ శాస్త్రాస్, న్యాయ శాస్త్రానికి సంబంధించిన చేతి రాతప్రతులు, సంస్కృతంలో ఉన్న 5 లక్షల శ్లోకాలను చైనా యాత్రికుడు ఇత్సింగ్ కాపీ చేశాడు. ఇక్కడ 8 పెద్ద రీడింగ్ హాల్స్ వున్నాయి. ఒక రీడింగ్ హాల్లో దాదాపు 100 మంది కూర్చొని చదువుకునే అవకాశం ఉన్నది. కిస్సింగ్ తర్వాత టేకి హాంగ్, హొయి యే కొరియా, మరొక చైనా సాధువు కేయి ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు. మహిపాల 1 కాలంలో అష్ట సహస్రిక-ప్రజ్ఞ పారమితను కళ్యాణ మిత్ర కాపీ చేశారు.. గోవింద పాల, రామపాల, బాల కాలంలో కూడా గ్రంథాలయం, విశ్వవిద్యాలయం ఉన్నత స్థాయి కీర్తి గడించింది. దేవపాలుని కాలంలో గ్రంథాలయ అభివృద్ధికి కొన్ని గ్రామాలను దత్తత ఇచ్చారు. వేల సంఖ్యలో తాటి ఆకుల మీద రాసిన చేతి రాతప్రతుల గ్రంథాలు బౌద్ధానికి సంబంధించిన హీనయాన, మహాయానకు సంబంధించినవి వున్నాయి.
వీటిని మట్టి పలకలలో తాటి ఆకు పత్రాలు పాడవకుండా భద్రపరిచేవారు. టిబెటియన్ చరిత్ర కారుల ప్రకారం నలంద విశ్వవిద్యాలయం గ్రంథాలయం చక్కటి విశాలమైన గదులు, వెలుతురు వచ్చే విధంగా కిటికీలు, ఎత్తయిన బురుజులు, కొండల మీద చాలా ప్రశాంతంగా చదువరులకు అనుకూలంగా ఉండే వాతావరణం, పై అంతస్తులోని రీడింగ్ రూమ్‌లు మేఘాలను తాకుతున్నాయా అనే విధంగా వుండేవట.
దేవపాలుని కోరిక మేరకు రాజగృహలో ఉన్న నలంద గ్రంథాలయాభివృద్ధికి బెంగాల్ మహారాజు ఐదు గ్రామాలను దత్తత ఇచ్చారు. ధర్మ రత్నస్య లేఖనార్థం చేతి రాతప్రతులను కాపీ చేశారు. హాయాన్ సాంగ్ ప్రకారం గ్రంథాలను, తత్వశాస్ట్రం, మతపరమైన పుస్తకాలు, చేతి రాతప్రతులను షెల్ఫ్‌లో, తాటి ఆకుపత్రాలను మట్టి పలకలలో భద్రపరిచారు.
చేతి రాతప్రతులను భద్రపరచడం: తాటి ఆకు పత్రాల ప్రతులను దారంతో అమర్చి మార్బుల్ బండలలో భద్రపరిచేవారు. దుమ్ము, ధూళి, అగ్నికి దూరంగా రాతప్రతులను కాపాడేవారు. ఆయా విభాగ ఉపాధ్యాయులు తమ గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను భద్రపరచి వాటి ఉన్నతి కొరకు పాటుపడేవారు. వివిధ రకాల న్యాయ పద్ధతులు ఉపయోగించి తాళపత్ర గ్రంథాలు, మట్టి పలకలు, రాళ్లపై రాసిన శాసనాలు, తాటి ఆకుల మీద రాసిన రాతపత్రులను జాగ్రత్తగా భద్రపరిచారు.
ఇక ఈ విశ్వవిద్యాలయాన్ని నాశనం చేయాలని మొదటగా శశాంక గౌడ దీనిపై పై దండెత్తాడు. దీనికి సంబంధించిన ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి. తరువాత 12వ శతాబ్దంలో భక్తి యార్ ఖిల్జి మూడు సార్లు దాడులు చేశారు. రెండు సార్లు విఫలంగా కాగా క్రీ.శ. 1193లో మూడోసారి నలంద విశ్వవిద్యాలయం నాశనమైంది.
భక్తియార్ ఖల్జీ ప్రాణాలు కాపాడటమే నలంద విశ్వవిద్యాలయం చేసిన తప్పని చరిత్రకారులు చెబుతున్నారు. అతడికి ఓ వింత జబ్బు వచ్చిన సందర్భంలో ఎంతో మంది వైద్యులు వచ్చి చూసినా జబ్బు నయం కాలేదు. ఆ సమయంలో నలంద విశ్వవిద్యాలయంలో వారు నయం చేస్తారని తెలిపారు. తొలుత బెట్టు చేసిన ఖిల్జీ.. ఆ తరువాత అక్కడ చదిన రాహుల్ శ్రీ భద్ర అనే గురువు ఖిల్జీ వ్యాధిని నయం చేశాడు. దీంతో తన ప్రాణాలు కాపాడిన విశ్వవిద్యాలయంపై కృతజ్ఞత లేకపోగా.. అసూయ, ద్వేషం పెంచుకున్నాడని చరిత్ర కారులు తెలిపారు. ఈక్రమంలోనే ఈ విజ్ఞానం భారతదేశంలోని భావితరాల వారికి అందకూడదనే ఉద్దేశంతో నలందపై దండెత్తి ధ్వంసం చేశాడు. గ్రంథాలయంలోని లక్షలాది గ్రంథాలను, దాదాపు 90 లక్షల రాతప్రతులు మాన్యుస్క్రిప్ట్ (వీaఅబరషతీఱజ్ూ)లను కాల్చాడు. ఈ గ్రంథాలయాన్ని పూర్తిగా తగులబెట్టడానికి, ఆ మంటలు ఆరడానికి మూడు నెలల సమయం పట్టిందట.
ఎంతో అమూల్యమైన పరిశోధనల సమాచారం కలిగిన ఈ గ్రంథాలు దగ్ధం అవడం వల్ల మనదేశం కొన్ని వందల సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది. క్రమంగా నలంద మరుగునపడి పోయింది. 1812లో స్కాట్లాండ్కు చెందిన పురావస్తు అధ్యయనకర్త ఫ్రాన్సిస్ బుచానన్ హామిల్టన్ దీన్ని కనుగొనేవరకు ఆ గురుతులు వెలుగుచూడలేదు అనంతరం 1861లో సర్ అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్ దీన్ని పురాతన నలంద విశ్వవిద్యాలయంగా గుర్తించారు.
2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూచనల మేరకు విశ్వవిద్యాలయాన్ని తిరిగి నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. నలంద శిధిలాలలో ఉన్న ఇది 2016లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది. భారతదేశంలోని అతి ప్రాచీనమైన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన నలందా విశ్వవిద్యాలయం 1600 సంవత్సరాల తర్వాత 2014 సెప్టెంబరు 1, సోమవారం తిరిగి ప్రారంభమైంది. గ్రంథాలయాన్ని కూడా తిరిగి పునరుద్ధరించారు. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి పుస్తకాలు (ప్రింట్, ఎలక్ట్రా నిక్) పాఠకులకు అందుబాటులో ఉంచారు.
– డా|| రవికుమార్ చేగొని, 9866928327