నవతెలంగాణ – కామారెడ్డి
గత తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ధరణి టౌన్షిప లో గల ప్లాట్లను, ఇండ్లను విక్రయించింది. వస్తువులు కల్పించడం మరిచిపోయిందిని ప్లాట్లను ఇండ్లను కొనుగోలు చేసిన యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ధరణి టౌన్షిప్ లో గల ప్లాట్ లకు ఇండ్లకు 2022 మార్చిలో లో ప్రభుత్వం వేలంపాట నిర్వహించి ఇండ్లను, ప్లాట్లను విక్రయించి మౌలిక వసతులు కల్పించాలేదని ఆరోపిస్తూ ప్లాట్లను, ఇండ్లను కొనుగోలు చేసిన యజమానులు ఆదివారం ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు ధరణి టౌన్షిప్ గేటు ఎదుట వారు తమ నిరసన వ్యక్తం చేశారు. ప్లాట్లను వేలం వేసే సమయంలో అక్కడ అన్ని వస్తువులు కల్పిస్తామని అప్పటి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ చెప్పడం జరిగిందన్నారు. ఇప్పటివరకు ఎలాంటి వసతులు కల్పించలేదని వెంటనే ధరణి టౌన్షిప్ లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ధరణి టౌన్షిప్ లో ప్లాట్లను, ఇళ్లను కొనుగోలు చేసిన యజమానులు మాట్లాడుతూ 2022 మార్చ్ లో ప్రభుత్వం ధరణి టౌన్షిప్ లో ఉన్న 60 ఇండ్లు 289 ప్లాట్లను వేలంపాట నిర్వహించి విక్రయించిందని తెలిపారు. అయితే ఒక్కొ ఇల్లు 32 లక్షలు పెట్టి ఇల్లు కొనుగోలు చేస్తే ఇప్పటివరకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదని తెలిపారు. ఇంటి మరమ్మత్తు కోసం మరో 15 లక్షలు ఖర్చు చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అప్పుల భారం పడిందని, ధరణి వెంచర్ లో ఉండకుండా వేరే ప్రాంతంలో అద్దెకు ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలుకు ముందు డిసెంబర్ 2022లో పూర్తి మరమ్మతులు చేసి ఇస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారని తెలిపారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి మరమత్తులు చేయకపోవడంతో పూర్తిగా అడవిని తలపించే విధంగా ధరణి టౌన్షిప్ తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి ధరణి టౌన్షిప్ లో వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్లాట్లను, ఇండ్లను కొనుగోలు చేసిన యజమానులు తదితరులు పాల్గొన్నారు.