వరి చీడ పురుగు నివారణకు చర్యలు చేపట్టాలి

Steps should be taken to prevent the rice pest– తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
వరి చీడపురుగు నివారణకు చర్యలు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం నిజాంబాద్ పట్టణంలో నాందేవాడలో  మల్లు స్వరాజ్యం భవన్లో తెలంగాణ రైతు సంఘం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తుంది అయినా ప్రభుత్వం రైతులకు రుణమాఫీ రెండు లక్షల వరకు చేస్తామని చెప్పింది ఇంకా కేటాయించలేదు రైతు రుణమాఫీ కానీ రైతులు బ్యాంకుల చుట్టూ సొసైటీల చుట్టూ తిరుగుతున్నారని రుణమాఫీ రెండు లక్షలు రైతుల ఖాతాలో డబ్బులు జమ కాలేదు.వెంటనే రెండు లక్షలు రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు సన్న దొడ్డు రవాలకు 500 రూపాయలు బోనస్ అన్ని పంటలకు ఇవ్వాలని కేవలం సన్న వాటికి మాత్రమే ఇస్తామని చెప్పడం సరైంది కాదని పంటలకు ఇవ్వాలని ఇటీవల కూర్చున్న వర్షానికి వారి పొట్ట దశలో చీర పురుగు పడుతుందని దిగుబడి రాని రైతులకు చిడ పురుగు నివారణకు చర్యలు చేపట్టాలని ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధరప్ప, జిల్లా కమిటీ సభ్యులు గోగుల చిన్న సాయిలు, న్యావనంది ముత్తన్న, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.