
మండలంలోని చీకటిమామిడి గ్రామంలో ఆదివారం భారతీయ కిసాన్ సంఘం మండల అధ్యక్షుడిగా దేసెట్టి లక్ష్మీనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులు తుమ్మల ఉపేందర్, ప్రధాన కార్యదర్శి వనం రవీందర్, సహాయ కార్యదర్శి మచన్నగారి చంద్రారెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా అర్హులైన ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ ఎలాంటి నిబంధనలు లేకుండా చేయాలని, పండించిన ప్రతి పంటకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని, రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి రూ.15000 ఇవ్వాలని ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, కౌలు రైతులకు సంవత్సరానికి రూ.12000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వచ్చేనెల 1వ తేదీన జరిగే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శి కాటం అయిలేష్ కుమార్, ఉప్పల పెంటారెడ్డి, నిమ్మ రాంరెడ్డి, ప్రముఖ్ సాధినేని రవీందర్ ,సహ ప్రముఖ వంగేటి అంజిరెడ్డి, కాశమైన ఆనంద్ లు పాల్గొన్నారు.