రేపు సామాజిక తనిఖీ ప్రజా వేదిక: ఎంపీడీవో 

Social Inspection Public Forum Tomorrow: MPDOనవతెలంగాణ – పెద్దవంగర

సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమాన్ని రేపు మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వేణుమాధవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని 26 గ్రామ పంచాయతీల్లో 1 ఏప్రిల్ 2023 నుండి 31 మార్చి 2024 వరకు జరిగిన ఉపాధి హామీ పనులపై ఆయా గ్రామాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించామని, ఈ తనిఖీలో గుర్తించిన అంశాలను సామాజిక తనిఖీ ప్రజా వేదిక ద్వారా బహిర్గతం చేయనున్నట్లు ఎంపీడీవో తెలిపారు.