ఆస్ట్రేలియాలో రాబిన్‌హుడ్‌

In Australia Robinhoodహీరో నితిన్‌ అప్‌ కమింగ్‌ యాక్షన్‌, హీస్ట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘రాబిన్‌హుడ్‌’. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ప్రారంభమైంది. వెంకీ కుడుముల  దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. లీడ్‌ పెయిర్‌తో డ్యూయెట్‌ సాంగ్‌ షూట్‌ని టీమ్‌ మొదలుపెట్టింది. కష్ణకాంత్‌ లిరిక్స్‌తో  జివి ప్రకాష్‌ ఆకట్టుకునే పాటను కంపోజ్‌ చేశారు. నితిన్‌, శ్రీలీల డాజ్లింగ్‌ కెమిస్ట్రీ హైలెట్‌గా ఉండనుంది. మెల్‌బోర్న్‌లోని అద్భుతమైన ప్రదేశాలలో షూట్‌ చేస్తున్న ఈ పాటకు శేఖర్‌  మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. సాంగ్‌తో పాటు బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్‌తో సహా ప్రధాన నటీనటులతో ముఖ్యమైన టాకీపార్ట్‌ని చిత్రీకరించ నున్నారు. ఈ చిత్రంలో  రాజేంద్ర ప్రసాద్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. అత్యున్నత స్థాయి నిర్మాణ, సాంకేతిక విలువలతో నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిస్మస్‌  సందర్భంగా డిసెంబర్‌ 20న ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. భిన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకంతో  మేకర్స్‌ ఉన్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: వెంకీ కుడుముల, సిఇఓ : చెర్రీ, సంగీతం: జివి ప్రకాష్‌ కుమార్‌, డీవోపీ: సాయి శ్రీరామ్‌, ఎడిటర్‌: కోటి, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌  కుమార్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, రవివర్మ, విక్రమ్‌ మోర్‌.